శంషాబాద్ లోని హెచ్ఎండీఏ నర్సరీని సందర్శించిన పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్…


• హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఆక్కడ కొనసాగుతున్న మొక్కల పెంపకాన్ని పరిశీలించిన మంత్రి

• ఈ సందర్భంగా నర్సరీలో మొక్కలు పెంచుతున్న తీరు, ఏ మొక్కలు అందుబాటులో ఉన్నాయి, వాటిని ప్రజలకు అందించే ప్రక్రియ వంటి పలు అంశాల పైన అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్
• నర్సరీ లో పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్, నర్సరీ లో పనిచేసే అర్హులైన వారందరికీ ఈ ఎఫ్, పి ఎఫ్ వంటి సౌకర్యాలను కల్పించే ఈ అంశాన్ని పరిశీలించాలని అధికారులకు అదేశమ

• తెలంగాణ ప్రభుత్వం ఈసారి హరితహారాన్ని మరింత పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రణాళికలు

• ముఖ్యంగా పురపాలక పట్టణాల్లో మొక్కలు నాటడం తోపాటు వాటిని పెంచడం పైన ఇప్పటికే శాఖ తరఫున ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామన్న మంత్రి

• హైదరాబాద్ పరిధిలో ఎవరికైనా మొక్కల కావాల్సి వస్తే నగర పరిధిలో ఉన్న నర్సరీలలో నుంచి ఉచితంగా తీసుకునే అవకాశం ఉన్నది

• ఒకటి రెండు రోజుల్లో నగరంలోని నర్సరీలున్న ప్రాంతాలతో పాటు వాటి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నింటిని తో కూడిన సమగ్ర సమాచారాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతాం

• ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన భవిష్యత్ తరాలకి గ్రీనరీ ని కానుకగా అందించే లక్ష్యంతో ముందుకు పోదామని మంత్రి కేటీఆర్

• ఇప్పటికే పలు పట్టణాలకు మొక్కలను తమ నర్సరీల నుంచి సరఫరా చేసిన హెచ్ఎండిఎ

About The Author