నాటుసారాపై జరిపిన దాడుల్లో… 1,600 లీటర్ల సారా ఊట ధ్వంసం..

చిత్తూరుజిల్లా:గంగాధరనెల్లూరునియోజకవర్గం,పాలసముద్రం మండలం ఎస్.కే.ఆర్ పురం అటవీప్రాంతంల్లో… స్థానికుల సమాచారం మేరకు… శుక్రవారం సాయంత్రం *నాటుసారాపై జరిపిన దాడుల్లో…* భాగంగా 1,600 లీటర్ల సారా ఊటను ద్వంశం చేసి 20 లీటర్ల నాటుసారా, సారా తయారీ పరికరాలను 10 డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ దాడుల్లో…

ఎస్సై షేక్షావలి, ఈస్ట్ సర్కిల్ ఐడి పోలీసు వేదనాయకం, సిపిఓ సిబ్బంది అగస్టీన్, ఇళయరాజ, గోవింద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎస్ఐ షేక్షావలి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

About The Author