ఏపీలో త్వరలో స్కూళ్ళు ప్రారంభం
దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా అన్ని పాఠశాలలు విద్యాసంస్థలు బంద్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏమిటంటే ఏపీ లో స్కూళ్లను త్వరలో ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలల రూపురేఖలు మార్చడానికి నాడు-నేడు చేపట్టామని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ స్కూళ్లను ప్రయివేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతామని మంత్రి సురేష్ చెప్పారు. ఎప్పుడు ప్రారంభిస్తామని త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.