ఏపీ హైకోర్టులో కరోనా కలకలం..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఓ వైపు కోవిడ్ 19 వైరస్ నిర్ధారణ పరీక్షలు పెరుగుతుంటే..మరోవైపు కేసుల సంఖ్య కూడా అధికమవుతోంది. తాజాగా.. ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు బుధవారం హైకోర్ట్ కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు రిజిస్ట్రార్.

హైకోర్ట్ పరిధిలోని అన్ని దిగువ కోర్టుల కార్యకలాపాలు కూడా రద్దయ్యాయి. కాగా ఏదైనా అత్యవసర పిటిషన్ అయితే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11 వేల 595కు చేరుకోగా…187 మంది కరోనా కారణంగా మరణించారు.రాష్ట్రంలో ప్రస్తుతం 7 వేల 897 యాక్టివ్ కేసులున్నాయి.

About The Author