విద్యుత్ షాక్ తో మహిళ మృతి.

చిత్తూరు జిల్లా:మదనపల్లె పట్టణం ప్యారనగర్ నందు శనివారం రాత్రి విద్యుత్ షాక్ తో కిరణ్మయి (33) మృతి. రాత్రి 8.30 గంటల సమయంలో కొద్ది పాటి వర్షం, గాలి రావడం జరిగింది.  సమయంలో ఇంటిపైన వున్న రేకులు విద్యుత్ తీగలపై పడ్డాయి. అది గమనించని కిరణ్మయి రేకులు పట్టుకోవడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా షాక్ తగిలి కాలిపోయింది. స్థానికులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి‌ చెందింది. మృతురాలికి‌ ఇద్దరు చిన్నారులు వున్నారు. మదనపల్లె టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు సుదీర్ఘ కాలం మదనపల్లె MC tv నందు న్యూస్ రీడర్‌గా పనిచేశారు.

About The Author