ఈ లేడీ ఎస్సై .! రేప్ కేసులో 35 లక్షల లంచం !!…

అత్యాచార నిందితుడి నుంచి రూ.35 లక్షల లంచం తీసుకున్నారనే అభియోగంపై ఓ మహిళా ఎస్‌ఐను గుజరాత్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిపై కేసు నమోదు కాకుండా చేసేందుకు లంచం డిమాండ్‌ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు తెలిపినవివరాలప్రకారం,అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీ పని చేసే ఇద్దరు మహిళలు తమపై కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కెనాల్‌ షా అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019లో ఈ కేసు నమోదు కాగా, దర్యాప్తు కొనసాగుతూ వస్తోంది. కాగా, ఇటీవల ఈ కేసు విచారణ అహ్మదాబాద్‌ మహిళా పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తోన్న శ్వేతా జడేజాకు అప్పగించారు…కేసు విచారణ ప్రారంభించిన శ్వేత, నిందితుడి నుంచి రూ.35 లక్షల లంచం డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిందితుడి సోదరుడు భావేష్‌ను హెచ్చరించారు. భావేష్‌ ఓ మధ్యవర్తి ద్వారా 20లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకొని, అ మొత్తాన్ని అప్పజెప్పాడు. కొద్ది రోజుల తర్వాత మరో 15లక్షలు ఇవ్వాలని ఎస్‌ఐ నుంచి ఒత్తిడి రావడంతో సిటీ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిర్యాదు రాగా, విచారణ చేసి శ్వేతను అరెస్ట్‌ చేశారు. కోర్టు రిమాండ్‌ను విధించింది.

About The Author