ఆ ₹50 కోట్లు మార్పిడి చేయండి: వైవీ
దిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వద్ద ఉన్న రద్దయిన నోట్లను మార్పిడి చేయాలని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ను తితిదే వైవీ సుబ్బారెడ్డి కోరారు. నిర్మలా సీతారామన్‌ను వైవీ సుబ్బారెడ్డి ఈ రోజు దిల్లీలో కలిశారు. నోట్ల రద్దుతో సుమారు ₹ 50 కోట్ల పాత నోట్లు తితిదేలో ఉండిపోయాయని సుబ్బారెడ్డి ఆర్థికమంత్రికి తెలిపారు. నోట్ల రద్దు సమయంలో భక్తులు కానుకలుగా ఇచ్చిన ఆ డబ్బును మార్చాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు, వెనుకబడిన జిల్లాలకు నిధులు తక్షణమే మంజూరు చేయాలని ఆర్థిక మంత్రిని కోరినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు