తిరుపతి నగరంలో కోవిడ్ కట్టడికి అత్యవసర సమావేశం
తిరుపతి, జులై 15 : తిరుపతి నగరంలో కేసులు అత్యధికంగా నమోదవుతున్నందున విషయం తెలిసిందే. ఇప్పటివరకు వార్డు వ్యవస్థ బాగాపని చేశారు, ఇక పై ఒక పద్దతి ప్రకారం నిర్దేశించుకుని ఆక్సిజన్ లెవెల్స్ సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్తా సూచించారు. తిరుపతి నగరంలో కేసులు నమోదు 800 వందలు దాటడంతో బుధవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ లలితకళాతోరణంలో జిల్లా కలెక్టర్ , నగరపాలక కమీషనర పీ.ఎస్.గిరీషా వార్డు సచివాలయ ఎ. ఎన్.ఎం. లు , అడ్మిన్ సెక్రెటరీలు అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది తో సమావేశమై దిశానిర్దేశం చేశారు .
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో సర్వేలు నిర్వహించి కేసులును గుర్తించడం జరిగిందని, తక్కువ కేసులు నమోదు వల్ల మీ పని మీరు చేసుకుని వెళ్ళేవారని, ఆ పరిస్థితి ఇప్పుడు లేదని ఒక పద్దతిని నిర్దేశించుకొని కోవిడ్ నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించారు. నేటి నుండి ఆక్సో పల్స్ మీటర్ సర్వే నిర్వహించి ఆక్సిజన్ లెవెల్స్ రీడింగ్ 95 లోపు ఉన్నవారిని గుర్తించాలని అందుకోసం ఏ ఎన్ ఏం లకు నేడు అక్సో పల్స్ మీటర్ లు అందిస్తున్నామని అన్నారు. 95 కన్నా రీడింగ్ తక్కువగా వుంటే రక్తంలో ఆక్సిజన్ తక్కువ వున్నట్లు అని, ఆరోగ్య పరిస్థితిని బట్టి అంచనా వేసి అర్బన్ హెల్త్ సెంటర్ కు పంపి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. స్వాబ్ టెస్టులలో ఆక్సిజన్ లెవెల్స్ 95 శాతం కన్న తక్కువగా ఉండి నెగిటివ్ వచ్చినా రక్త పరీక్ష , ఎక్స్-రే తీసి న తరువాత వారి ఇంటికి పంపాల్సి ఉంటుందని తెలిపారు. పాజిటివ్ రిసల్ట్ వచ్చిన వారిని వార్డు వారీగా ఒక్క టైమ్ ఫిక్స్ చేసి 10 రోజులకు సరిపడా అతను కావలసిన పుస్తకాలు తినుబండారాలు, ఇతరత్రా బట్టలు వంటి తీసుకొని రావాలని సూచనలు ఇచ్చి, నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన వాహనాల్లో ప్రాదాన్యత క్రమంగా సమస్య తీవ్రత ఉంటే రుయా ఆసుపత్రికి, తక్కువ ఉంటే శ్రీనివాసం కోవిడ్ కేంద్రాలకు పంపించాలని సూచించారు. ప్రతి వార్డు లో ఎ ఎన్ ఎం లు , వాలెంటీర్ లు గుర్తించిన వారితో అడ్మిన్ సెక్రెటరీ లు పర్యవేక్షణలో ఉండి పేషెంట్లకు రవాణా ఏర్పాటు, ప్రైమరీ, సెకండరీ కేసుల గుర్తింపు వంటివి సంయుక్తంగా చేపట్టాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటిలో 60 సంవత్సరముల పైబడినవారు , 10 సంవత్సరములలోపు పిల్లలు లేకుండా, బెడ్ రూమ్, అటాచ్డ్ బాత్ రూమ్ ఉంటే హోం ఇసోలేషన్ కు అనుమతి ఇవ్వాలని , వారికి మెడికల్ కిట్ అందించి 10 రోజుల పాటు వారి ఆరోగ్య పరిస్తితి తెలుసుకోవాలని ఇబ్బందులు ఉంటే ఆస్పత్రులకు రెఫర్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. తిరుపతి నగరపాలక పరిధి లోని అర్బన్ హెల్త్ సెంటర్లో పరీక్షా కిట్లు అందుబాటులో ఉన్నాయా ? లేదా? తెలుసుకొని ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్న వారిని తీసుకొని వెళ్ళానని సూచించారు. ఇప్పటికే అన్ని వార్డులలో కేసులు వునాయని, 20 దాటిన కేసులు గల 18 వార్డులు కంటైన్ మెంట్ జోన్ లో ఉన్నాయని, ప్రజలు మస్కూలు, సానిటైజర్ లు , భౌతిక దూరం పాటించేలా సూచనలు ఇవాలని సూచించారు. నగరపాలక కమీషనర్ గిరీషా మాట్లాడుతూ ఆక్సిజన్ పల్స్ సర్వే వారంలోపు పూర్తి చేసి, గుర్తించిన వారిని పరీక్షలు నిర్వహించాలని, రానున్న రోజులు కీలకం కానున్నాయని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సిన రోజులు వచ్చాయని వార్డు సచివాలయాల పరిధిలో నమోదైన కేసుల వివరాలు మీవద్ద అందుబాటులో ఉండాలని తెలిపారు. సెక్టోరల్ అధికారులు, వార్డు అడ్మిన్ సెక్రెటరీ లు నిరంతర అప్రమత్తం అవసరమని తెలిపారు. ఆక్సిజన్ లెవెల్స్ సర్వే వెళ్ళే టప్పుడు సచివాలయ సిబ్బంది సానిటైజర్ లు, మస్కులు తప్పనిసరిగా వాడేలా ఉండి తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ సూచించిన విధంగా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్న వారిని గుర్తించి , యాప్ లో నమోదు చేయడం, స్వాబ్ పరీక్షలకు అర్బన్ హెల్త్ సెంటర్ కు తీసుకొనివెళ్ళడం, రిసల్ట్ వచ్చిన తరువాత నెగటివ్ వచ్చిన వారికి ఎక్స్ – రే, రక్త పరీక్షలు చేసి ఇంటికి పంపడం, పాజిటివ్ వచ్చిన వారిని వ్యాధి తీవ్రతను బట్టి స్విమ్స్, రుయా ఆసుపత్రా? శ్రీనివాసం కోవిడ్ సెంటరా ? నిర్ణయించి, నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన వాహనాలలో తరలించడం చేయాలని సూచించారు. ఇలా చేస్తే మనం 99 శాతం కోవిడ్ తీవ్రత నుండి బయట పడినట్లు అన్నారు. ఈ సమావేశంలో డిసి చంద్ర్దమౌళీశ్వర్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ సుధారాణి , మానేజర్ ఆసిన్ , నగరపాలకలోని అన్ని వార్డుల ఎ ఎన్ ఎం లు, అడ్మిన్ సెక్రెటరీ లు, అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.
డివిజినల్ పి ఆర్ ఓ తిరుపతి