ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి…


అసలే ఓవర్ లోడు. ఆపై అతివేగం.. వెరసి ఓ నలుగురి ప్రాణాలు గాలిలో కలిశాయి. ఇది డ్రైవర్ నిర్లక్ష్యమనాలో.. లారీ యజమాని కక్కుర్తి అనాలో తెలియని పరిస్థితి. కట్టెల లోడుతో వెళుతున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడడంతో నలుగురు మృతిచెందారు,7 గురికి తీవ్ర గాయాలు…ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీటాయపాలెంలో కట్టెల లోడుతో వెళుతున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు…

ప్రమాదంలో చనిపోయిన వారిని రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతు తండాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి ఓవర్ లోడుతో పాటు అతివేగం కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

About The Author