ప్రాణాపాయ స్థితిలో ఉన్న జర్నలిస్ట్ గోపాలకృష్ణ కి ఆపత్భాంధవుడు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు….


పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం ఆంధ్ర భూమి జర్నలిస్ట్ గోపాలకృష్ణ కు కరోనా పాజిటివ్ వచ్చింది…గత 5రోజులుగా తాడేపల్లి గూడం క్వారంటైన్ లో ఉంటున్నాడు… అయితే ఈ సాయంత్రం ఆకస్మికంగా గోపాలకృష్ణ కి ఊపిరి ఆడక నా నా అవస్థలుపడుతున్నారు… ఒక్కసారిగా జర్నలిస్ట్ పరిస్థితి విషమస్థితికి చేరింది… జర్నలిస్ట్ గోపాలకృష్ణ ఏడుస్తూ APUWJ పూర్వ అధ్యక్షులు డి సోమసుందర్ గారికి రాష్ట్ర APUWJ ఉపాధ్యక్షులు మాణిక్యరావు గారికి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మురళి కృష్ణమ రాజు గారికి.. టీవీ 9జిల్లా జర్నలిస్ట్ రవి కుమార్ గారికి ఫోన్లో చేప్పడం జరిగింది.. ఈ క్రమంలో

…జర్నలిస్ట్ నాయకులు నా దృష్టికి తీసుకు రావడంతో
నేను
వెంటనే జర్నలిస్ట్ గోపాలకృష్ణ ఆరోగ్యం విషమ పరిస్థితిని ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారికి చేప్పడం జరిగింది…

జర్నలిస్ట్ గోపాలకృష్ణ ఆరోగ్యం విషమ పరిస్థితిలో ఉందని ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారి దృష్టికి తీసుకువెళ్లడంతో ఒక్క సెకను కూడా అలోచించకుండా వెంటనే జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ శంకరావు గారితో మాట్లాడి జర్నలిస్ట్ గోపాలకృష్ణ కి అత్యవసరంగా వైద్య మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆళ్ల నాని గారు అదేశిo చారు….

తక్షణమే జర్నలిస్ట్ గోపాలకృష్ణ ను వెంటనే ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ కి తరలించి వైద్య సేవలు అందించాలని మంత్రి ఆళ్ల నాని గారు అదేశాలు ఇచ్చారు…

ఎక్కడ రాజీ పడకుండా వైద్యం అందించాలని కోరడంతో జర్నలిస్ట్ గోపాలకృష్ణ ను అంబులెన్సు లో ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ కి తరలించే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు డాక్టర్ శంకరావు ను అదేశించారు…

ప్రస్తుతం గోపాలకృష్ణ ప్రాణాపాయ స్థితి నుండి బైట పడ్డారు…

జర్నలిస్ట్ లకు ఆపత్భాంధవుడు మంత్రి ఆళ్ల నాని గారు నిలిచారు..

రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో జర్నలిస్ట్లు కరోనా బారిన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు స్పందించి ఆయా జిల్లాల జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు స్పష్టంగా అదేశాలు ఇవ్వడం తో జర్నలిస్ట్ లు క్వారంటైన్ సెంటర్స్ క్షేమం గా ఉన్నారు…

రాష్ట్రములోని ఒంగోలు.. విజయవాడ.. గుంటూరు.. విశాఖపట్నం…విజయనగరం.కాటూరు…కర్నూల్….పశ్చిమగోదావరి…జిల్లాలల్లో జర్నలిస్ట్ కి కరోనా పాజిటివ్ రావడం తో వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని… క్వారంటైన్ సెంటర్ల కు తరలించాలనిరాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి ఆళ్ల నాని గారు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు….

About The Author