ఉపాధ్యాయ బదిలీలను వెంటనే చేపట్టాలి….
ఉపాధ్యాయ బదిలీలను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని చిత్తూరు జిల్లా యుటిఎఫ్ ఆడిట్ కమిటీ సభ్యుడు గురునాథం కోరారు. సోమవారం తమ సమస్యల సాధన కోసం సత్యవేడు మండల పరిషత్ కార్యాలయం ఎదుట పలువురు యుటిఎఫ్ సంఘ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆడిట్ కమిటీ సభ్యుడు గురునాథ్ మాట్లాడుతూ కంట్రిబ్యూటర్ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన నాలుగు విడతల కరువు భత్యాన్ని ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు. పిఆర్సిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల అకాడమిక్ నష్టపోకుండా ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలించాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని మరోమారు పునసమీక్షించి విద్యార్థులకు విలువలు పెరిగేటట్లు నూతన విద్యా వ్యవస్థ ఉండాలని ఆయన కోరారు.అంతకుమునుపు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు సమస్యలపై ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. తదనంతరం మండల్ పరిషత్ అధికారులకు యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో యు టిఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఎం ఎం రవి, శివప్రసాద్,త్యాగరాజులు, మునికృష్ణ, ప్రభావతి, సరోజిని, ముని కళ్యాణి, రేణుక, తదితరులు పాల్గొన్నారు.