అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కొత్త రథం ఆకృతి
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో… లక్ష్మీనరసింహస్వామి రథం కాలిన ఘటనపై సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా… రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో… కొత్త రథానికి సంబంధించి రూపు రేఖల గ్రాఫ్ సిద్ధమైంది. ఆలయ ప్రత్యేకాధికారి రామచంద్రమోహన్, ఏసీ భద్రాజీ రథం ఎలా ఉండాలో తాజాగా చర్చించారు. పాతరథంలాగే ఉంటూ… మరింత ఆకర్షణీయంగా, అత్యంత శాస్త్రబద్ధంగా ఉండేలా డిజైన్ సిద్ధం చేశారు. కొత్త రథం 41 అడుగుల ఎత్తు ఉండనుంది. ఆరు చక్రాలతో ఏడు అంతస్తులుగా ఉంటుంది. రథం నిర్మాణానికి, షెడ్డు రిపేర్, ఇనుప షట్టర్ ఏర్పాటికి రూ.95 లక్షలు అవుతాయని అంచనాలున్నాయి. కాలిపోయిన రథానికి రూ.84 లక్షల ఇన్సూరెన్స్ ఉంది.
అంతర్వేది కొత్త రథం ఆకృతి
రథం కాలిన ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. సీబీఐ ఎంక్వైరీకి ప్రతిపాదించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటే చాలదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. నిన్న బీజేపీ, జనసేన కలిసి… రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాయి. కాకినాడలో కలెక్టరేట్ ముందు బీజేపీ, జనసేన చేసిన ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు.
వైసీపీ ప్రభుత్వం మాత్రం… వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. రథం ఘటన వెనక… ప్రభుత్వాన్ని కూల్చే… కుట్ర పూరిత కోణం ఉండొచ్చని భావిస్తున్న ప్రభుత్వం… సీబీఐ దర్యాప్తు జరిపించాలని కేంద్రానికి ప్రతిపాదించడంతో… సేఫ్ జోన్లోకి వెళ్లినట్లు ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. సీబీఐ ఎంక్వైరీకి కోరడం ద్వారా… ఈ అంశంపై రాజకీయ దుమారం చేస్తున్న ప్రతిపక్షాలన్నింటికీ చెక్ పెట్టినట్లు అయ్యిందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది.