విధుల యందు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు…
*అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారు*
సార్,
నిన్నటి దినం శ్రీ కాళహస్తి ఆలయం నందు ఆలయ గార్డ్ డ్యూటీ విధులు నిర్వహిస్తున్న సందర్భంలో తిరుపతి సాయుద దళం విభాగానికి చెందిన కే.సుబ్రమణ్యం ఏ.ఆర్ హెచ్.సి 1234 ఇతని అజాగ్రత్త వళ్ళ ఆయుధం మిస్ ఫైర్ అయిన ఘటనలో భాధ్యునిగా చేస్తూ సస్పెండ్ చేయడమైనది.
పోలీస్ అంటే అప్రమత్తం, భద్రత కల్పించేవారు. పోలీస్ వారి వలన ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఎలాంటి ఇబ్బందులు ఇతరులకు కలగకూడదు. పొరపాటుకు పోలీస్ లో తావు లేదు. ఎలాంటి సందర్భాలైనా, ఎలాంటి కారనాలైనా భాద్యత వహించాల్సిందే. భద్రత కల్పించాల్సిన మనం ఆభద్రతగా వివరించకూడదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. ఇందులో భాగంగానే అతనిని సస్పెండ్ చేస్తున్నట్లు తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారు తెలిపారు.