హైదరాబాద్ ట్రాఫిక్ మళ్లించిన ప్రాంతాలివే…
హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా నగరంలో పలుచోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్-కర్నూలు హైవే దెబ్బతినడంతో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారు.. ఓఆర్ఆర్‌పై నుంచే వెళ్లాలని పోలీసులు సూచించారు. మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు టోలిచౌక్ ప్లైఓవర్ వాడొద్దని చెప్పారు. అందుకు ప్రత్యామ్నాయంగా సెవెన్ టూంబ్స్ నుంచి వెళ్లాలని ప్రయాణీకులను కోరారు. పురానాపూల్ 100 ఫీట్ల రోడ్డును పూర్తిగా మూసి వేశారు. ఇటువైపు వెళ్లే వాహనాలను కార్వాన్ మీదుగా మళ్లిస్తున్నారు.
మలక్‌పేట్ ఆర్‌యూబీ రోడ్ బ్లాక్ అయ్యింది
దీంతో ఆ మార్గంలో వచ్చే వాహనాలు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. మూసీ ఉప్పొంగడంతో మూసారాం బాగ్ బ్రిడ్డి దగ్గర ట్రాఫిక్ స్తంభించింది. ఇటు వైపు రావొద్దని పోలీసులు వాహనదారులకు సూచించారు. మలక్‌పేట్ వద్ద నాలా పొంగడంతో మలక్‌పేట్-ఎల్బీనగర్ మార్గం పూర్తిగా బ్లాక్ అయ్యిందని పోలీసులు వెల్లడించారు