పూర్ణ “సుందరి” ప్రీ లుక్ విడుదల..


అవును , అవును 2 చిత్రాల నటి పూర్ణ నటించిన తాజా చిత్రం “సుందరి”. దాదాపు దక్షిణాది అన్ని భాషల్లో నటించిన పూర్ణ ఇప్పుడు ఈ చిత్రం లో టైటిల్ రోల్ ప్లే చేతుంది. పూర్ణ ముందు మళయాళ భాషల్లో నటించింది. 2004 లో సినీ తెరంగేట్రం చేసిన పూర్ణ తెలుగు తెరకు శ్రీ హరి గారి శ్రీ మహా లక్ష్మి చిత్రం ద్వారా పరిచయమైంది. అల్లరి నరేష్ “సీమ టపాకాయ్” ద్వారా మంచి గుర్తింపును పొందారు. కానీ రవిబాబు “అవును” చిత్రం ఆమెకు మంచి నటిగా గుర్తింపును తీసుకు వచ్చింది.
“నాటకం” సినిమాకు దర్శకత్వం వహించి, విమర్శకుల ప్రశంశలు అందుకున్న కళ్యాణ్ జీ గోగన ఇప్పుడు పూర్ణ తో సుందరి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ అంబ‌టి కీలక పాత్ర పోషిస్తున్నారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామాగా త‌యార‌వుతున్న ఈ సినిమా టైటిల్‌కు ‘ది అల్టిమేట్ డెసిష‌న్ ఆఫ్ యాన్ ఇన్నోసెంట్ లేడీ’ అనే ట్యాగ్‌లైన్ జోడించారు.’సుంద‌రి’ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. త్వ‌ర‌లో ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేయ‌నుంది.

About The Author