ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం…


ఇరవై యేండ్ల క్రితం ఒక్కడితో మొదలైన ఉద్యమ ప్రస్థానం ఇవ్వాళ ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ ఆత్మ గౌరవ పతాకం ఎగరేసే దాకా వచ్చింది.

మొక్కవోని పోరాట పటిమతో సబ్బండ వర్గాలను ఏకం చేసి, చివరకు ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సమితికి త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో గొప్ప కార్యాలయం నిర్మాణం కానుంది. ఇది పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ గర్వకారణం.

గౌరవ ముఖ్యమంత్రి ,పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పార్టీ తరపున టి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం ఢిల్లీలోని వసంత్ విహార్ లో స్థలం కేటాయించిన పత్రాలను అందుకున్న మంత్రి శ్రీ ప్రశాంత్ రెడ్డి

About The Author