బెల్లంకొండ జెడ్పీటీసీ అభ్యర్థి… కిడ్నాప్…?


గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం వైసిపి జెడ్పీటీసీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డి తెల్లవారుజామున హైద్రాబాద్లో కిడ్నాప్ గురైనట్లు బంధువులు తెలిపారు …బంధువులు తెలిపిన వివరాల ప్రకారం బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో ఐదేళ్లు గ్రామ సర్పంచ్గా… జడ్పీటీసీ అభ్యర్థిగా బీఫారం తీసుకున్న వెంకట్ రెడ్డికి వైసిపి పార్టీలో తనకు గౌరవం లభించటం లేదని.. అసహనంతో ఉన్న ఆయన మండల స్థాయిలో తన సన్నిహితులతో సమావేశం వేసి.. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు హైదరాబాద్ వెళుతున్న వారిని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం ….వీరితో పాటు మరికొంత మంది బెల్లంకొండ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా వివిధ ప్రాంతాలలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం … ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఎంతో బాధాకరమని కొందరు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా జీవించటం స్వేచ్ఛగా ఆలోచించడం తప్ప అని ప్రశ్నిస్తున్నారు* Courtesy:G Vasanth kumar Goud

About The Author