అయోధ్యలో రామాలయం నిర్మాణానికి రూ. 1,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాన్ ఏంటి…
విరాళాలు సేకరించడం ద్వారా అయోధ్యలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని, విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రామ మందిరం నిర్మాణానికి కావలసిన నిధులు సమకూర్చుకునేందుకు తమ ప్రచారాన్ని 50 కోట్ల మంది ప్రజల వద్దకు తీసుకువెళతామని, ఇంత పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు అనుసంధానమయ్యే బృహత్ కార్యక్రమాన్ని ప్రపంచ చరిత్రలో ఎవరూ చూసి ఉండరని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమానికి ఇచ్చే విరాళాలను ‘చందాలు’ అని అనకుండా ‘రామ మందిర నిధి సమర్పణ ప్రచారం’ అని పిలుస్తారు. అంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భక్తితో, అంకితభావంతో విరాళాలు సమర్పించుకుంటారు.
ఈ ప్రచారం గురించి వివరంగా చెబుతూ…”ఈరోజుల్లో 35 ఏళ్ల వాళ్లకు రామ జన్మభూమి చరిత్ర పెద్దగా తెలీదు. అప్పట్లో ఏం జరిగిందో ఎవరూ చూసి ఉండరు. యువత శాతం అధికంగా ఉన్న దేశం మనది. యువతకు మన చరిత్ర తెలియజెప్పడం మన కర్తవ్యం” అని చంపత్ రాయ్ అన్నారు.
ఈ ప్రచారంలో 3 నుంచీ 4 లక్షలమంది కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. వీరంతా రామ జన్మభూమి చరిత్రను 50 కోట్లమంది ప్రజలకు, 11 కోట్ల కుటుంబాలకు, 5 లక్షలకు పైగా గ్రామాలకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రచార కార్యక్రమం 2021లో జనవరి 14, మకర సంక్రాంతినాడు ఆరంభమై, ఫిబ్రవరి 27, మాఘ పూర్ణిమనాడు ముగుస్తుంది.
42 రోజులపాటూ సాగే ఈ ప్రచార కార్యక్రమంలో కార్యకర్తలు తమతోపాటూ రామ మందిరం చరిత్ర, ఆలయ చిత్రాలు, కంట్రిబ్యూషన్ కూపన్లు తీసుకువెళతారు. రామ జన్మభూమి చరిత్రను హిందీ, ఇంగ్లిష్లో మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాల మాతృభాషల్లోనూ ముద్రిస్తారు.
దేశ ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతో సహా రాజాకీయ పార్టీ నాయకులందరికీ రామ జన్మభూమి చరిత్రను అందిస్తారు..
రామ మందిర నిధి సమర్పణ ప్రచారం
“ఆలయం అంటే దేవుడి నివాసం. భగవంతుడి పాదాల చెంత లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి డబ్బుకు ఏ విధమైన కొరతా ఉండదు. డబ్బు గురించి చింత పడొద్దని అనేకమంది మహానుభావులైన సాధువులు నాకు చెప్పారు…భగవంతుని వెనుకే లక్ష్మి కూడా ఉంటుంది. అందుకే ఎవరినీ డబ్బులు అడగక్కర్లేద సమాజమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందిస్తుందని అన్నారు. అందుకే మేము కూడా ప్రజలకు అదే చెప్పదలుచుకున్నాం…స్వఛ్చందంగా విరాళాలివ్వండి. ఇదంతా దేవుడు సృష్టించిన సంపద..దేవుడికే ఇవ్వండి అని చెప్తున్నాం. ఎవరినీ డబ్బులు అడగవలసిన అవసరం రాదు” అని చంపత్ రాయ్ వివరించారు..
“స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేవారికోసం కొన్ని కూపన్లు ముద్రించాలని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. ఎన్ని ఇళ్లకు వెళ్లాలనుకుంటున్నామో అన్ని కూపన్లు ముద్రిస్తాం…10, 100, 1000 రూపాయల కూపన్లు ముద్రిస్తాం. ఎవరైనా రూ.10 ఇచ్చిన సరే…మా తల్లిదండ్రులు ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొన్నారని వారి పిల్లలు ఆనందంగా చెప్పుకోవాలి అందుకని 10 రూపాయల దగ్గరనుంచీ కూపన్లు ముద్రిస్తాం.
10 రూపాయలవి 4 కోట్ల కూపన్లు, 100 రూపాయలవి 8 కోట్ల కూపన్లు, 1000 రూపాయలవి 12 లక్షల కూపన్లు ముద్రిస్తాం. వీటన్నిటికీ రశీదు ఇస్తాం. ఈ కూపన్లన్నింటినీ ప్రజలకు పంచిపెట్టడం ద్వారా రామ మందిర నిర్మాణానికి 960 కోట్ల రూపాయలను జమ చెయ్యలన్నదే మా ప్రయత్నం” అని చంపత్ రాయ్ తెలిపారు.
_*పారదర్శకత~*
“నిధి సమర్పణ ప్రచారంలో పారదర్శకత కోసమే కూపన్లను ముద్రించాలని నిర్ణయించుకున్నాం. ఈ విధంగా సేకరించిన సొమ్మును దేశంలోని మూడు పెద్ద బ్యాంకులు..స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలలో జమ చేస్తాం. భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 22 వేల శాఖలున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు వరుసగా 14వేల శాఖలు, 10వేల శాఖలు ఉన్నాయి. అంటే మొత్తం 46 వేల శాఖలనుంచీ మొత్తం దేశాన్ని కవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం.
ఈ పని కోసం మా కార్యకర్తలు రోజులో మూడు నుంచీ నాలుగు కేటాయిస్తారు. కనీసం ముగ్గురితో కూడిన బృందాలను ఏర్పాటు చేస్తాం. ఈ బృందాలన్నింటినీ ప్రాంతాలవారీగా విభజించి ఒక బ్యాంకు శాఖను కేటాయిస్తాం. ఒక రోజు మొత్తంలో సేకరించిన డబ్బులు 48 గంటలలోగా ఆ బ్యాంకు శాఖలో జమ చెయ్యాలి. 42 రోజులపాటూ సేకరించిన సొమ్మును ఈ బృందాలు తమకు కేటాయించిన శాఖలోనే జమ చెయ్యాలి. బ్యాంకుల్లో డబ్బులు జమ చెయ్యడానికి వేరే స్లిప్పులు ముద్రిస్తాం. దాన్లో అకౌంట్ నంబర్ కాకుండా కోడ్ నంబర్ ఉంటుంది. పారదర్శకత కోసమే ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నాం” అని చంపత్ రాయ్ తెలిపారు.
*విశ్వహిందూ పరిషత్*
???️?????
జై *శ్రీరామ్*