మే చివరి నాటికి పది పరీక్షలు పూర్తి మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి


మే చివరి నాటికి పది పరీక్షలు పూర్తి

ఈనాడు డిజిటల్‌, ఖమ్మం: రాష్ట్రంలో మే నెల చివరి నాటికి పదో తరగతి పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో శుక్రవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ఆరు కస్తూర్బా విద్యాలయాల భవనాలను సబిత ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పరీక్షలు రాసే విద్యార్థులకు హాజరుశాతం తప్పనిసరి చేయొద్దని పాఠశాలలను ఆదేశించినట్లు చెప్పారు. ప్రతి విద్యార్థికి పరీక్షలు రాసే అవకాశం ఇచ్చేలా విద్యా సంస్థలను ఆదేశిస్తామన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి ఆపై తరగతుల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చిన్న తరగతులకు పాఠశాలల నిర్వహణపై తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దూరదర్శన్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.

About The Author