ఢిల్లీలో మాస్కులు వేసుకొని దాడులు చేసిందెవరు?
రిపబ్లిక్ డే సందర్భంగా సాగు చట్టాల రద్దు కోసం రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో హింస చోటుచేసుకుంది. పోలీసులు అనుమతించిన రూట్లో కాకుండా మరోక రూట్లో కొందరు ఆందోళనకారులు ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉద్యమ జెండా ఎగురవేశారు. ఆ తర్వాత పోలీసులతో ఘర్షణ పడ్డారు. పోలీసుల పైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరోవైపు ఐవోటి సెంటర్‌లో కొందరు వ్యక్తులు ముగసులు ధరించి పోలీసులపై రాడ్లతో దాడులు చేశారు. అంతటితో ఆగక మీడియాపైన కూడా దాడి చేశారు. దీంతో దాదాపు 18 మంది పోలీసులు గాయాలపాలయ్యారు. అయితే ఈ హింసకు పాల్పడిన వారితో రైతు ఉద్యమానికి సంబంధం లేదని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. ఎర్రకోట వద్ద ఘర్షణకు దిగిన వారు తమకు చెందిన వారు కాదని రైతు సంఘాలు పేర్కొన్నాయి. రైతుల ఆందోళనలోకి కొన్ని సంఘవిద్రోహ శక్తులు జరబడ్డాయని రైతు సంఘాలు తెలిపాయి. రైతు ఆందోళనలను తప్పుదొవ పట్టించేందుకు కుట్ర జరిగిందని ఆరోపించాయి. తామంతా పోలీసులు అనుమతించిన మార్గాల్లోనే శాంతియుతంగా ర్యాలీ చేశామని చెప్పాయి. ర్యాలీకి అనుమతులు ఇచ్చిన పోలీసులు పదే పదే తమను అడ్డుకుంటూ రెచ్చగొట్టారని పేర్కొన్నాయి
జై జవాన్ జై కిసాన్