ఉద్యోగం పెట్టిస్తా అని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు


ఉద్యోగం పెట్టిస్తా అని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ చేసిన జైపూర్ పోలీసులు

ఈరోజు శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి కోటేశ్వర్ జైపూర్ ఎస్సై రామకృష్ణతో కలిసి జైపూర్ పోలీస్ స్టేషన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అరెస్ట్ కు సంబంధించిన వివరాలు వెల్లడించడం జరిగింది.

వివరాల్లోకి వెళితే……

*గద్దల రమేష్ తండ్రి పేరు మరాఠీ వయసు 33 సంవత్సరాలు కులం మాదిగ జైపూర్ ఎస్సి కాలనీ. లోచెందిన వ్యక్తి గతంలో 2018 సంవత్సరంలో జైపూర్ పవర్ ప్లాంట్ లోని పవర్ మేక్ కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేసేవాడు. ఆ పని చేయగా వచ్చే డబ్బులు నా జల్సాలకు అవసరాలకు ఇంటి ఖర్చులకు సరిపోయేవి కావు ఎలాగైనా ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలని ఎలాంటి కష్టం లేకుండా సంపాదించాలని అందుకు అమాయక వ్యక్తులతో నాకు పవర్ ప్లాంట్ లో నాకు పెద్ద సార్లు పరిచయం అని వారికి చెప్పి ఉద్యోగాలు పెట్టిస్తా అని నమ్మించి డబ్బులు తీసుకుని తర్వాత వారికి కనిపించకుండా తిరిగేవాడు.
? 2019 సంవత్సరంలో జనవరి నెలలో కంపెనీవారు నేను డ్యూటీకి సరిగా రావడం లేదని నన్ను ఉద్యోగం నుండి తీసేసారు అప్పటినుండి ఏ పని లేకుండా తిరుగుతుండగా గత ఏడాది మా కులస్థుడు అయిన రామగిరి రవి సన్నాఫ్ లింగయ్య అనే అతడు తనకు జీతం సరిపోవడం లేదని వేరే ఉద్యోగం చూసుకోవాలని అనగా గా గద్దల రమేష్ అతనికి పవర్ ప్లాంట్ లో సురేష్ రెడ్డి అనే అధికారి నాకు చాలా దగ్గర అని అతను తలుచుకుంటే ఉద్యోగం పెట్టిస్తాడు అని డబ్బులు ఇస్తే తప్పకుండా ఉద్యోగం వచ్చేలా చేస్తా అని అతనికి చెప్పగా అతను నా మాటలు నమ్మినవాడు అతని నుండి రూ 50 వేల రూపాయలు నవంబర్ నెలలో ఉద్యోగం పేరు చెప్పి తీసుకున్నాడు.
? నిజానికి సురేష్ రెడ్డి అనే అధికారి లేడు నేనే సురేష్ రెడ్డి అని పేరు చెప్పాడు.రవి మరో వ్యక్తి తో పాటు వచ్చి ముందు బిల్డింగ్ వద్దకు వచ్చి డబ్బులు ఇచ్చి పోయినాడు.
? అదే నెలలో రవి తన స్నేహితుడు ప్రదీప్ అనే అతనితోపాటు కోదాడ సిమెంట్ కంపెనీ లో ఇంజనీర్ గా పని చేస్తున్నాడు అని తల్లిదండ్రులు ముసలివారు అని తన భార్య ఆరోగ్యం బాగా లేదని రాకపోకలకు ఇబ్బంది అవుతుందని ఎలాగైనా ఎస్పీ లో ఒక ఉద్యోగం చూడమని కోరగా అతని నుండి కూడా సురేష్ రెడ్డి అధికారి పేరు చెప్పి రెండు సార్లు రవి నుండి తీసుకున్న ప్రదేశంలోనే 5000 రూపాయలు ఒకసారి 20వేల రూపాయలు ఒకసారి తీసుకున్నాడు. డబ్బులు కావాలనుకున్నప్పుడలా ప్రదీప్ కు సార్ ఎక్కువ డబ్బు కావాలి అంటున్నాడు ఇతని ఫోన్ నెంబర్ నుండి ప్రదీప్ నెంబర్ కు ఫోన్ చేసి చెప్తే అతను రమేష్ గూగుల్ పే కు ఒక్కసారి 30000,40000 అలా దఫాలుగా మొత్తం రూ 5,20,000 రూపాయలు రమేష్ ఖాతా కు పంపినాడు.
?రమేష్ అతనికి నా ఫోన్ నుండి సురేష్ రెడ్డి సార్ మాట్లాడతారని చెప్పి రమేష్ మూతికి రుమాలు కట్టుకొని గొంతు మార్చి మాట్లాడి అతని మోసం చేసే వాడు. అతను సురేష్ రెడ్డి నెంబర్ కావాలని నన్ను బలవంతం పెట్టగా మరొక నెంబర్ ఇచ్చాను. ప్రదీప్ దానికి కాల్ చేయగా ఎప్పటిలాగే మూతికి రుమాలు కట్టి గొంతు మార్చి మాట్లాడేవాడు. ఇలా మోసాలకు పాల్పడేవాడు.

ఈ మధ్య కాలంలో కొంతమంది కొంతమంది వ్యక్తులు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారిని, వారి అవసరాలను ఆసరాగా తీసుకుని అమాయక వ్యక్తులని ఉద్యోగాలు ఇప్పిస్తామని ముందుగా డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.ఉద్యోగాలు ఇప్పిస్తాం అని మోసం చేస్తున్న వంటి వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. వారిపై కేసు నమోదు చేసి పి.డి యాక్ట్ అమలు చేయడం జరుగుతుంది. ఇప్పటికె ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరిగింది.

About The Author