లంబసింగి కి శ్రీకారం..
ఆంధ్ర ప్రదేశ్ లో వింటర్ డెస్టినేషన్ ఏదీ అంటే లంబసింగి. విశాఖ జిల్లా అటవీ ప్రాంతంలో సముద్రమట్టానికి ఎత్తుగా వున్న ఈ పర్వత ప్రాంతంలో టెంపరేచర్ మైనస్ డిగ్రీలోకి వెళ్తుంది శీతాకాలంలో. మంచు రోజంతా కురుస్తుంటుంది. అందుకే అందరూ అటు ఛలో అంటున్నారు.
టెంట్ లు, స్లిపింగ్ బ్యాగ్ లతో అక్కడ ఓ రాత్రి అయినా గడిపి వస్తున్నారు. ఇప్పుడు అలాంటి లంబసింగి టైటిల్ తో సినిమా తయారుచేస్తున్నారు సీనియర్ ప్రొడ్యూసర్ జికె. మెగాస్టార్ కు అత్యంత సన్నిహితుడైన జికె ఓ వైవిధ్యమైన కథ నచ్చి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
దర్శకుడు నవీన్ గాంధీ. గతంలో గాలిపటం అనే యూత్ ఫుల్ సినిమా అందించాడు ఇతగాడు. బిగ్ బాస్ ఫేమ్ దివి హీరోయిన్. భరత్ రాజ్ హీరో.
ఈ సినిమా షూటింగ్ కూడా లంబసింగి, పాడేరు, చింతపల్లి, సీలేరు, డొంకరాయి, నర్సీపట్నం ప్రాంతాల్లోనే జరుగుతుంది. ఈ నెల 31న అక్కడే ప్రారంభమై, అక్కడే షూట్ జరుపుకుని, అక్కడే పూర్తవుతుదీ సినిమా.