సెల్యూట్ మేడమ్! యావత్ స్త్రీ శక్తికే గర్వకారణం
సెల్యూట్ మేడమ్!
ఆడవాళ్ళు ఇంటికే పరిమితమని లేదా ఇలాంటి పనులే చేయాలి అనే సమాజంలో…
ఎంచుకున్న వృత్తికి, వేసుకున్న యూనిఫారనికి, చేస్తున్న సేవకి సగర్వంగా చేస్తున్నాం -సెల్యూట్.
యావత్ స్త్రీ శక్తికే గర్వకారణం
ఖాకీ దుస్తుల్లో కాఠిన్యం కాదు…కారుణ్యం కూడా ఉంటుందని నిరూపించిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. అయినవారినే భారంగా భావించే ఈ రోజుల్లో అనాధ శవాన్ని ఆత్మ బంధువులా మోస్తున్న ఈ మహిళా ఎస్సై శిరీష మహోన్నత హృదయానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని మోసేందుకు స్థానికులు నిరాకరించారు. దీంతో ఎస్సై శిరీష గారు స్వయంగా మృతదేహాన్ని మోసుకొచ్చి అంతిమసంస్కరాల కోసం ఓ చారిటబుల్ ట్రస్ట్ కు అప్పగించారు.