పట్టాలెక్కని విశాఖ రైల్వే జోన్….?


విశాఖకు రైల్వే జోన్ అన్న డిమాండ్ పుట్టి యాభై ఏళ్లు అయింది. రెండు దశాబ్దాలుగా పోరాటం సాగిందే చివరికి రెండేళ్ల క్రితం అదీ ఎన్నికలు ముందు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వచ్చి రైల్వే జోన్ ఇచ్చేశామని చెప్పారు. జనమంతా తెగ సంబరపడ్డారు.
ఆ తరువాత కధ ఏంటి అంటే బంగారం లాంటి 150 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేర్ డివిజన్ ని ముక్కచెక్కలు చేసి అసలు ఎమీ కనబడకుండా చేశారు. పోనీ రైల్వే జోన్ అయినా దక్కిందా అంటే కాగితాల మీద తప్ప ఆ ఊసు అయితే ఇప్పటికీ లేదు.
గత బడ్జెట్ నయం తాజా బడ్జెట్ కంటే అన్నట్లుగా ఉంది. గత బడ్జెట్ లో రైల్వే జోన్ కి అంటూ ఒక రెండు కోట్లు నిధులు కేటాయించారు. ఈసారి అదీ లేకుండా పోయింది.
మరో వైపు చూస్తే నాలుగైదు వేల కోట్లు ఉంటేనే తప్ప విశాఖ రైల్వే జోన్ అన్నది తయారవదు, మరి ఇలా కనీసం రూపాయి అయినా విదల్చకుండా కేంద్రం చేస్తే విశాఖకు రైల్వే జోన్ ఏ యుగం లో వచ్చినట్లు అని సామాన్య జనం ఆవేదన.
ఏది ఏమైనా విశాఖ అంటే ఇపుడు కేంద్ర పెద్దలకు స్టీల్ ప్లాంట్ గుర్తుకు వస్తోందిట. ఎందుకంటే దాన్ని ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. అంటే ఎన్నికల ముందు ఒక హామీలా రైల్వే జోన్ ఇచ్చామనిపించారు కానీ అసలు అచరణలో మాత్రం రైల్వే కూత ఎప్పటికీ వినిపించదేమో అన్న డెసిషన్ కి జనాలు వచ్చేశారు.

About The Author