సుల్తాన్ ను లైట్ తీసుకోవద్దు…


తమిళ హీరో కార్తీ అంటే మన తెలుగు జనాలకు మాంచి అభిమానం వుంది. సరైన సినిమా చేస్తే చాలు నెత్తిన పెట్టుకుంటారు. కార్తీ చేసిన సినిమాల్లో చాలా వరకు తెలుగునాట అభిమానం పొందినవే.లేటెస్ట్ గా ఖాకీ, ఖైదీతో సహా.
అలాంటి హీరో లేటెస్ట్ సినిమా టీజర్ వచ్చింది. టీజర్ రావడమే కాదు. డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. కార్తీ ఫ్యామిలీ బ్యానర్ డ్రీమ్ వారియర్ బ్యానర్ మీద నిర్మించిన సుల్తాన్ సినిమా టీజర్ వచ్చింది.
మాంచి ఇంటెన్సివ్ కథతో సినిమా తయారవుతున్నట్లు టీజర్ చెప్పకనే చెబుతోంది. పైగా తెలుగు సినిమాల్లో మాంచి లక్కీ హ్యాండ్ అనిపించుకున్న రష్మిక నే ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నారు.
ఏమాత్రం బాగుంది అనిపించుకున్నా థియేటర్లలో కూర్చునిపోతుంది. కానీ ఆ తరువాత వారం వచ్చే వకీల్ సాబ్, ఆపైన వచ్చే లవ్ స్టోరీలకే సమస్య అవుతుంది. మళ్లీ థియేటర్లు వ్యవహారం..అంతా మామూలే.

About The Author