వేములవాడ మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు


వేములవాడ మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన మంత్రి శ్రీ కేటీఆర్. ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి.
– ఆలయ, పోలీస్, రెవెన్యూశాఖల సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలి
– నాలుగు నుండి ఐదు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది
– సామాన్య భక్తులకు దర్శనం కల్పించడంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి
– జాతరకు వచ్చే విఐపి భక్తులకు ఒకే సమయం కేటాయించి అదే సమయంలో దర్శనం కల్పించాలి.. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలి
– ఆలయ వసతి గదులను భక్తులకు కేటాయించాలి
– జాతరకు భద్రత నిమిత్తం విధులకు వచ్చేవారికి ఇతరచోట్ల వసతి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కు సూచన
– జాతరలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని ఆదేశం
– 3 లక్షల మాస్క్ లు ఉచితంగా అందజేసేందుకు ఏర్పాటు చేయాలి. 25 చోట్ల ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
– వంద పడకల ఆస్పత్రిని మార్చి మొదటి వారంలోనే ప్రారంభించే విధంగా పనులు వేగవంతం చేయాలని ఆదేశం
– అన్ని శాఖల సమన్వయంతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు పనులను షేర్ చేసుకోవాలని సూచన
– పరిశుభ్రతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.. పరిసరాల పరిశుభ్రతను మున్సిపల్ అధికారులు కూడా పర్యవేక్షించాలి
– రహదారులు కూడా ఎక్కడ గుంతలు లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు
– జాతర సందర్భంగా ఈ ఏడాది కూడా హెలికాప్టర్ సౌకర్యాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలి
– బస్టాండ్ నుండి ఆలయం వద్దకు చేరుకునేందుకు మినీ బస్సులను ఏర్పాటు చేయాలి
– వేసవి కాలం కావడంతో మిషన్ భగీరథ తాగునీరు… విజయ డైరీతో మాట్లాడి మజ్జిగ ప్యాకెట్లు కూడా సమకూర్చుకోవాలని సూచన
– జాతరకు సంబంధించిన ఏదైనా ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందస్తుగా పోలీస్ , ఫైర్ రెవిన్యూ, వైద్య ,ఆలయ అధికారులు మాక్ డ్రిల్ చేసుకొని ముందస్తుగా అప్రమత్తం కావాలని ఆదేశించారు
– రాజమండ్రి లాంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు
– సాంస్కృతిక వేడుకలు కూడా యధావిధిగా నిర్వహిస్తామని ఇందుకు తగిన ఏర్పాటు చూడాలని సూచించారు
– ఇరవై రోజుల తర్వాత నిర్వహించే సమీక్ష సమావేశానికి సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధమై రావాలని అధికారులను ఆదేశించిన మంత్రి
– ప్రస్తుతం ఆలయానికి వచ్చే భక్తులకు కనీస కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా ఆలయంలో చర్యలు లేవని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు

About The Author