కశ్మీర్లో ఆపరేషన్ సక్సెస్: ప్రధాన ఉగ్రవాది అరెస్ట్
ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్న లష్కరే -ఈ -ముస్తఫా వ్యవస్థాపకుడు హిదాయతుల్లా మాలిక్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కశ్మీర్లో జరిపిన దాడుల్లో ఈ కీలకమైన ఉగ్రవాది ఆచూకీ లభించింది. అదుపులోకి తీసుకునే క్రమంలో అతడు ఎదురుదాడికి దిగాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై అతి కష్టమ్మీద హిదాయతుల్లాను అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ నుంచి కశ్మీర్ వెళ్తుండగా అతడిని అరెస్ట్ చేశారు.
జమ్మూ, అనంత్‌నాగ్ పోలీసులు సంయుక్తంగా శనివారం ఆపరేషన్ చేపట్టగా కుంజువాణి ప్రాంతంలో హిదాయతుల్లా కనిపించాడు. వాహనాల తనిఖీ సమయంలో కనిపించిన అతడి వివరాలు అడగడానికి ప్రయత్నించగా పోలీసులపై తుపాకీతో ఎదురు దాడి దిగాడు. దీంతో పోలీసులు అతడిని చుట్టుముట్టేసి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పిస్టోల్, ఓ గ్రనేడ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ సీనియర్ ఎస్పీ శ్రీధర్ పాటిల్ తెలిపారు. కశ్మీర్ లోయలో జైషే- ఈ- మహ్మద్ అనే సంస్థను నిర్వహిస్తున్నాడని వివరించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియ్సాలి ఉంది.