నీ న్యూడ్ ఫొటోలు పంపు.. లేకపోతే..
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ వ్యక్తి తన కూతుర్ని వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరులోని అగ్రహార దసరహల్లి ప్రాంతానికి చెందిన ఓ 17 ఏళ్ల బాలికకు గత జనవరి నెలలో ఇన్స్టాగ్రామ్ ద్వారా కార్తిక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొద్దిరోజులు ఇద్దరి మధ్య చాటింగ్‌లు నడిచాయి. ఆ తర్వాతి నుంచి బాలికను న్యూడ్ ఫొటోలు పంపాలంటూ అతడు వేధించసాగాడు.
ఆమె స్పందించకపోయే ‘నీ న్యూడ్ ఫొటోలు పంపు! లేకపోతే చెయ్యి కోసుకుంటా’ అని బెదిరించసాగాడు. దీంతో భయపడిపోయిన బాలిక అతడికి తన న్యూడ్ ఫొటోలు కొన్ని పంపింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. కార్తిక్‌పై ఫిర్యాదు చేసింది. నిందితుడిపై సంబంధిత సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.