స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు: జనసేనాని పవన్
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరినట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. స్టీల్ ప్లాంట్‌పై తుది నిర్ణయం కేంద్రానిదేనన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఏపీ ప్రజల మనోభావాలకు ప్రతీకగా భావించాలని కేంద్ర మంత్రులను కోరామన్నారు. స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ చేయాలనుకుంటే ఏదైనా చేయవచ్చని చెప్పారు. కేంద్రమంత్రి చెప్పినట్టుగా పోస్కో, స్టీల్ ప్లాంట్ మధ్య ఒప్పందం జరిగినప్పుడు.. జగన్ లేఖ రాయడంలో ఆంతర్యమేంటని పవన్ ప్రశ్నించారు.
మార్చి 3, 4 తేదీల్లో జనసేన, బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోనున్నట్టు తెలిపారు. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితిని అమిత్ షాకు వివరించానని పవన్ కల్యాణ్ అన్నారు. దేవాలయాలపై దాడుల విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.