అకౌంట్లో కనీస మొత్తం లేకున్నా టోల్‌ ప్లాజా నుంచి అనుమతి..


అకౌంట్లో కనీస మొత్తం లేకున్నా టోల్‌ ప్లాజా నుంచి అనుమతి
15 నుంచి పూర్తి స్థాయి టోల్‌ చెల్లింపులు ఫాస్టాగ్‌ ద్వారానే: ఎన్‌హెచ్‌ఏఐ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ‘ఫాస్టాగ్‌’ అకౌంట్‌/వాలెట్‌లో కనీస నిల్వ నిబంధనను ఎత్తివేస్తూ నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది. దీని ద్వారా.. టోల్‌ప్లాజాల వద్ద అనవసర జాప్యాన్ని నివారించవచ్చని, వాహనాల రద్దీని కూడా నియంత్రించవచ్చని పేర్కొంది. ఇప్పటివరకు ఫాస్టాగ్‌ అకౌంట్‌/వాలెట్‌లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉంటేనే.. టోల్‌ప్లాజాల నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు. ఇప్పుడీ నిబంధనను ఎత్తివేయడంతో.. మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేకున్నా వాహనాన్ని అనుమతిస్తారు.
ఆ వాహనానికి సంబంధించిన టోల్‌ ఫీజును బ్యాంకులు.. ఫాస్టాగ్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ నుంచి మినహాయించుకుంటాయి. వినియోగదారుడు ఆ తర్వాత చెల్లించే ఫాస్టాగ్‌ మొత్తానికి దీన్ని జతచేసి చెల్లించాలి. 80% టోల్‌ ఫీజు చెల్లింపులు ఫాస్టాగ్‌ ద్వారానే జరుగుతుండగా.. ఫిబ్రవరి 15 నాటికి దీన్ని నూరు శాతానికి తీసుకెళ్లేందుకు ఎన్‌హెచ్‌ఏఐ యత్నిస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

About The Author