డి‌జి‌పి కార్యాలయం పత్రిక ప్రకటన… ఏపీ డి‌జి‌పి పాయింట్స్


1) రెండో విడత పంచాయతీ ఎన్నికలను సమర్థ వంతంగా నిర్వహించిన పోలీసు సిబ్బందిని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు.

2) 57 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు, 20 కంపెనీల CRPF బలగాలు, 41 వేల పై చిలుకు సివిల్ పోలీసులతో పాటు మొత్తం 47000 పైగా పోలీసు సిబ్బంది ని రెండో విడత ఎన్నికల్లో వినియోగించినట్లు డీజీపీ పేర్కొన్నారు.

3) మొదటి విడత ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ శాతం పోలింగ్ నమోదయినప్పటికీ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు.

4) 2013 ఎన్నికలతో పోలిస్తే, ఈ దఫా తక్కువ అల్లర్లు జరిగినట్లు, పోలీసు శాఖ చొరవ తీసుకొని అహర్నిశలు శ్రమించడం వలనే ఇది సాధ్యమైనట్లు వారు తెలిపారు.

5) ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు ను ఉపయోగించుకోవడం, స్వేచ్చా యుత వాతావరణంలో ఎన్నికలు జరగడం ముదావహం. ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికలు ఎంతో అవసరం – డీజీపీ.

6) వృద్దులు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో తమ వంతు సహాయం చేసిన పోలీసు సిబ్బంది సేవలను వారు కొనియాడారు.

7) తదుపరి రెండు విడతల ఎన్నికలను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తామని డీజీపీ తెలియ చెప్పారు. ఓటర్లు మరింత నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలియ చెప్పారు.

8) ప్రశాంతమైన స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్క పౌరునికి పోలీస్ శాఖ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతుంది.

9) చక్కటి వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పోలీస్ శాఖకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులకు కృతజ్ఞతలు.

10)గతం లో మునుపెన్నడూ లేని విధంగా మొదటి విడతలో 81.78% పోలింగ్ శాతం కాగా రెండు విడత ఎన్నికల్లో మరింత మెరుగైన స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు చేయడంలో పోలీసులు , ప్రభుత్వ యంత్రాంగం విజయవంతంగా సఫలీకృతం.

About The Author