మోడీ ప్రారంభించిన ఈ గూడ్స్ ట్రైన్ వీడియో చూసి ఆశ్చర్యపోదాం.
https://www.facebook.com/chadaVsastry/videos/10219668242120241
పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి అని చర్చలు జరుగుతున్న ఈ సమయంలో ఈ పెద్ద పోస్ట్ తప్పక చదవండి. నలుగురితో పంచుకోండి.
మన దేశంలో ఉన్న రైల్వే లైన్స్ తక్కువ కావడం వల్ల ప్రయాణీకుల ట్రైన్స్ మరియు గూడ్స్ ట్రైన్స్ కూడా ఒకే ట్రాక్ ల మీద నడపవలసి వస్తోంది.
ప్రయాణీకుల ట్రైన్స్ కి సమయపాలన ముఖ్యం కాబట్టి అవి టైం లోగా గమ్యం చేరుకోవాలి కాబట్టి ఉన్న ట్రాక్స్ మీద నడవడానికి వాటికి ప్రాధాన్యత ఇచ్చి గూడ్స్ ట్రైన్స్ ని ట్రాక్స్ ఖాళీగా ఉన్న టైముల్లో నడుపుతున్నారు. దీని వల్ల రైల్వే ద్వారా జరుగుతున్న సరుకు రవాణా చాలా ఆలస్యం జరుగుతోంది. ఈ ఆలస్యం కారణంగా ముఖ్యంగా తొందరగా పాడయిపోయే ఆహార పదార్ధాలు, పళ్ళు, కూరగాయలు, చేపలు మొ. రవాణాకు వ్యాపారవేత్తలు గూడ్స్ ట్రైన్స్ ని నమ్ముకోవడం మానేసి ఖర్చు ఎక్కువ అయినా రోడ్డు రవాణా ద్వారా అంటే లారీలు, కంటైనర్లు ద్వారా పంపుతున్నారు.
నిజం చెప్పాలి అంటే రైల్వేలకు ప్రయాణీకులు ద్వారా వచ్చే ఆదాయం కన్నా గూడ్స్ ట్రైన్స్ నడపడం వల్లే ఎక్కువ ఆదాయం వస్తుంది. ప్రయాణీకుల ట్రైన్ నడపడం చాలా ఖర్చుతో కూడిన పని. ఎందుకంటే బోగీలు నిర్మాణం చేస్తున్న దగ్గర నుండి వాటిని మైంటైన్ చెయ్యడం, రైల్వే స్టేషన్లు నిర్వహించడం, ప్రయాణీకులకు అన్ని సదుపాయాలు అంటే తాగు నీరు, విశ్రాంతి గదులు, టాయిలెట్స్ ఏర్పాటు చేయడం వరకు అంతా విపరీతమైన ఖర్చుతో కూడుకున్నదే. కానీ ప్రజలకు అందుబాటు ధరలో రవాణా సౌకర్యాలు కల్పించాలి అనే ఉద్దేశ్యంతో రైల్వే శాఖ ప్రయాణీకుల ట్రైన్స్ టిక్కెట్ ధరలు తక్కువలో ఉంచి అంటే పరోక్షంగా సరుకు రవాణా మీద వస్తున్న ఆదాయాన్ని ఇటు మళ్ళిస్తూ, నష్టాలు భరిస్తూ ప్రయాణికులు ట్రైన్స్ నడుపుతోంది.. నిజంగా రైల్వే శాఖ ప్రయాణీకుల ట్రైన్స్ బదులు ఒక్క గూడ్స్ ట్రైన్స్ మాత్రమే నడుపుకుంటే కొన్ని వేల కోట్ల లాభాలు ఆర్జించగలవు.
సో దీనికి పరిష్కారం? ప్రయాణీకుల ట్రైన్స్, గూడ్స్ ట్రైన్స్ వేరే వేరే ట్రాక్స్ మీద నడపడం. కానీ దేశంలో ముఖ్యమైన నగరాలను కలుపుతూ ఒక్క గూడ్స్ ట్రైన్స్ మాత్రమే నడపడానికి ప్రత్యేక మైన రైల్వే ట్రాక్స్ వెయ్యాలి అంటే కొన్ని వేలకోట్ల రూపాయల పెట్టుబడి అవసరం పడుతుంది. ఇలా చేస్తే బాగుంటుంది అని దశాబ్దాలుగా అనుకుంటున్నా రైల్వే దగ్గర అంత పెట్టుబడి లేదు. ముందు నుండి మనం అనుసరించిన సోషలిస్టు ఆర్ధిక విధానాలు వల్ల ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించలేదు. మొత్తానికి యూపీఎ టైం లో 2006 సం. లో ఇలా గూడ్స్ ట్రైన్స్ కోసం ప్రత్యేక రైల్వే కారిడార్స్ నిర్మించాలి అని నిర్ణయం తీసుకొని “డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా” అని ఒక కంపనీ ప్రారంభించారు. కానీ ఆర్భాటంగా ప్రారంభించిన అన్ని స్కీముల్లాగే UPA ప్రభుత్వం వద్ద డబ్బులు లేక ఇది నత్త నడక నడిచింది. 2014లో మోడీ ప్రభుత్వం వచ్చాక పనులు వేగం పెరిగాయి.
ముందుగా ముఖ్య మైన మార్గాల్లో రెండు కారిడార్లు నిర్మించాలి అని అనుకున్నారు.
1. వెస్ట్రన్ DFC – ఉత్తరప్రదేశ్ లో దాద్రి నుండి ముంబై పోర్ట్ వరకు
2. ఈస్టర్న్ DFC – పంజాబ్ లో లూథియానా నుండి పశ్చిమ బెంగల్ లో డాంకుని వరకు.
ఈ రెండు 2022కి పూర్తి చేయాలి అని ప్రణాళిక.
ఇప్పటికి రెండింటిలోనూ సుమారు 60% పని పూర్తి అయింది.
వాజపేయి గారు నాలుగు ముఖ్య మెట్రో నగరాలను కలుపుతూ గోల్డెన్ హైవే కారిడార్ నిర్మించిన విధంగా ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ని కూడా Golden Quadrilateral Freight Corridor (GQFC) గా నిర్మించాలి అని నిర్ణయించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా నగరాలను నేరుగా కలిపే చతుర్భుజ కారిడార్స్ కాకుండా ఉత్తర-దక్షిణ అంటే ఢిల్లీ- చెన్నై మరియు తూర్పు-పడమర అంటే కలకత్తా-ముంబై ప్లస్ ఆకారంలో కూడా నిర్మిస్తారు. ఈ దిశగా ఇప్పటివరకు కేంద్రం అనుమతులు ఇచ్చినవి.
1. WDFC 1468 Km
2. EDFC 1760km
3. EWDFC – 2000 km
4. NSDFC – 2173 km
5. ఈస్ట్ కోస్ట్ DFC విజయవాడ నుండి ఖరగపూర్ 1100km
6. సౌత్ వెస్ట్ DFC చెన్నై నుండి గోవా 890 km
వెస్ట్రన్ DFC మరియు ఈస్టర్న్ DFC లో ఇప్పటికే 350 కిమి పైగా నిర్మాణం పూర్తి అయి అంత వరకూ సరుకు రవాణా కూడా మొదలు అయింది.
ఈ కారిడార్స్ లో ఎలక్ట్రిక్ వైర్స్ కూడా అంటే ట్రాక్షన్ లైన్స్ చాలా ఎత్తులో నిర్మిస్తున్నారు. ఎందుకంటే గూడ్స్ ట్రైన్స్ లో వాడే పొడవైన ప్లాట్ ఫార్మ్ వాగన్స్ మీద పెద్ద కంటైనర్లు ఒక దానిపై ఒకటి పెడితే సరిపోయే అంత ఎత్తులో నిర్మిస్తున్నారు. అంటే ఒకేసారి ఒక ప్లాట్ ఫార్మ్ వెగన్ మీద 4 పెద్ద కంటైనర్లు రవాణా చెయ్యవచ్చు అన్న మాట.
డబల్ స్టాక్ కంటైనర్లు రవాణా చేయగలిగిన ప్రపంచంలో మొట్టమొదటి గూడ్స్ ట్రైన్ ని ప్రధాని మోదీ జనవరిలో ప్రారంభించారు. ఈ ట్రైన్ పొడవు సుమారు 1.5 కి.మీ. ఈ ట్రైన్ WDFC లో భాగం అయిన హర్యానాలో న్యూ అటెలి నుండి రాజస్థాన్ లో కిషన్ గంజ్ వరకు 306 కి.మీ ప్రయాణం చేస్తుంది.
ఈ ఒక్క గూడ్స్ ట్రైన్ 10 అడుగులు పొడవు గల 360 కంటైనర్లను ఏక బిగిన తీసుకొని పోగలవు. అంటే రోడ్డు మీద రవాణా లెక్కల్లో చెప్పాలి అంటే విదేశాల్లో ఉండే అతి పొడవైన 270 ట్రక్కుల సరుకును ఈ ఒక్క గూడ్స్ ట్రైన్ ఎలెక్ట్రిసిటీ మాత్రమే ఉపయోగించి రవాణా చేయగలదు.
అంటే దేశానికి ఎంత డీజిల్ ఆదా అవుతుందో ఊహించండి. మనం ఈ రోజు పెట్రోల్ మీద డీజిల్ మీద లీటర్ కి ₹10 ఎక్కువ చెల్లిస్తున్నాం అని బాధపడుతున్నాం. కానీ ఆ ₹10 తగ్గించడం తాత్కాలిక ఊరట లేదా తాత్కాలిక పరిష్కారం.
కానీ పెట్రోల్ డీజిల్ పై ఇలా ఎక్కువ వసూలు చేస్తున్న సొమ్ము ఇటువంటి కారిడార్లు, విద్యుత్తు మీద నడిచే ట్రైన్స్, మెట్రోలు మొ. నిర్మిస్తే పెట్రో ఉత్పత్తుల బదులు విద్యుత్ వాడుక పెరిగి పెట్రో వాడుక బాగా తగ్గితే దేశానికి మనకి కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వాడుక తగ్గడం వల్ల ఈ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా అదుపులో ఉంటాయి.
మోడీ ప్రారంభించిన ఈ గూడ్స్ ట్రైన్ వీడియో చూసి ఆశ్చర్యపోదాం.