ఈ కాముక తండ్రికి యావజ్జీవ శిక్ష చాలదు.. ఉరి తీసిఉండాల్సింది.
ఒక కసాయి , కాముక తండ్రికి యావజ్జీవ శిక్ష విధిస్తూ థానే జిల్లా పోక్స్లో కోర్టు న్యాయమూర్తి కవిత తీర్పుచెప్పారు. కన్నకూతురిపై ఆ నీచుడు అత్యాచారం చేసి , ఆమెను గర్భవతిని చేశాడు. భార్యనుంచి విడిపోయిన నీచుడు , కూతురిని తనవద్దే ఉంచుకున్నాడు. 10 ఏళ్ళ వయసులో ఉండగా కూతురిపై అత్యాచారం చేసాడు.బయటకు చెప్పవద్దని , చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అప్పటినుంచి బాలికకు 14 వ ఏడు వచ్చేవరకు , వాడి నీచ , నికృష్ట, వికృత చేష్టలు కొనసాగాయి. అభం , శుభం తెలియని బాలిక దిక్కుతోచని స్థితిలో , ఆ నీచ తండ్రి కాముకత్వాన్ని భరించింది. ఒక రోజు కడుపు నొప్పిగా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది.అక్కడ డాక్టర్లు , ఆ బాలికకు గర్భం వచ్చిందని పసిగట్టారు. విషయం అడిగితే , జరిగిన దారుణం మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేసింది. దీంతో డాక్టర్లు పోలీసులకు సమాచారమిచ్చారు. కేసుపెట్టిన పోలీసులు , బాలిక గర్భస్థ పిండానికి , డీఎన్ ఏ పరీక్షలు జరిపి , బాలికపై తండ్రి చేసిన దారుణాన్ని నిర్థారించారు. దీంతో న్యాయమూర్తి వాడికి యావజ్జీవ శిక్ష విధించింది..