అప్పుడు తప్పించుకున్నా ఇప్పుడు రాజీనామా చేసాడు


రాసలీలల సాగిస్తూ ఫోటోల్లో చిక్కిన కర్ణాటక బిజెపి మంత్రి రమేశ్ జర్కిహోలి మొదటి నుంచి వివాదాస్పదుడే. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆరు సార్లు గెలిచిన రమేశ్ ను బిజెపి ఆదాయపన్ను దాడులతో లొంగదీసుకుని ఎడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవినిచ్చింది. 2017 జనవరిలో ఆదాయపన్ను శాఖ 160 కోట్ల అక్రమ సంపాదనను గుర్తించింది. ఆయనను బర్తరఫ్ చేయాలని బిజెపి డిమాండ్ చేయగా సిఎం కుమారస్వామి వెనకేసుకొచ్చారు. రమేశ్ సన్నిహితురాలు, బినామీగా వ్యవహరించే లక్ష్మి హెబ్బెల్కర్ ఇంటి పైనా ఐటి-రెయిడ్స్ జరిగాయి. లక్ష్మి గతంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండేవారు. స్త్రీ లోలుడిగా పేరున్న రమేశ్ ఆ తర్వాత బిజెపిలో చేరి మంత్రి అయ్యారు.
(ఫోటోలో రమేశ్, లక్ష్మి హెబ్బెల్కర్)

About The Author