తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా…


తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కరోనా సోకింది. కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలతో ఆయన కొద్ది రోజులుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. సీఎంకు కరోనా సోకడం నిజమేనని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ధృవీకరించారు. కొద్దిరోజుల క్రితమే ఆయన నాగార్జున సాగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్‌కు మద్దతుగా ఆయన హాలియా ఎన్నికల సభలో పాల్గొన్నారు. నోముల భగత్‌కు కూడా కరోనా సోకింది.

About The Author