తప్పిన పెనుప్రమాదం ,,,సకాలంలో ఆక్సిజన్ అందించి 400 మంది…
తప్పిన పెనుప్రమాదం ,,,సకాలంలో ఆక్సిజన్ అందించి 400 మంది ప్రాణాలను కాపాడిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు
*విజయవాడ GGHలో ఆక్సిజన్ తో చికిత్సపొందుతున్న సుమారు నాలుగు వందలకు మంది కోవిడ్ భాదితులు*
*18టన్నుల తో వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాకింగ్ వ్యవస్థ తో తెగిపోయిన సంబంధాలు*
*విజయవాడ సిటీ కమిషనర్ కి సమాచారాన్ని చేరవేసిన సంబంధిత అధికారులు*
*హుటాహుటిన రంగంలోకి దిగిన విజయవాడ సి.పి ఒరిస్సా నుండి విజయవాడ వరకు ఉన్న అన్ని మార్గ మధ్యలో ఉన్న జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేసిన సిపి*
*ఈస్ట్ గోదావరి జిల్లా, ధర్మవరం వద్ద ఓ డాబా లో ఆక్సిజన్ ట్యాంకర్ ని గుర్తించిన ప్రత్తిపాడు పోలీసులు*
*నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా లో నిమగ్నం అవడంతో అలసిపోయి వాహనాన్ని నిలిపి వేసినట్టుగా పత్తిపాడు సిఐ కి డ్రైవర్ వివరించాడు*
*డ్రైవర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ప్రత్తిపాడు సిఐ…అధికారుల ఆదేశాలతో ఆక్సిజన్ ట్యాంకర్ కు గ్రీన్ చానల్ ఏర్పాటు*
*డ్రైవర్ కి తోడుగా అనుభవం కలిగిన హోంగార్డుతో ఆక్సిజన్ ట్యాంకర్ ను గ్రీన్ ఛానల్ ద్వారా సురక్షితంగా విజయవాడ జి.జి.హెచ్ కి చేర్చిన పోలీసులు*
*మరోసారి ప్రజాసేవలో తమ బాద్యతను సక్రమంగా నిర్వహించిన పోలీసుల లో ఉన్న మానవత్వాన్ని చాటిచెప్పిన పోలీసులను మనస్ఫూర్తి అభినందనలు: డిజిపి*