ఘనంగా జాతీయ యువజన దినోత్సవం
*ఘనంగా జాతీయ యువజన దినోత్సవం*
గోరంట్ల: స్వామి వివేకానంద జయంతి వేడుకలు అమ్మ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాది ఎస్.ఆర్.ఆంజనేయులు మాట్లాడుతూ స్వామి వివేకాకనంద గురించి రోజులు తరబడి మాట్లాడుకున్న ఆయన కొత్తవ్యక్తిగా కనపడుతాడు ఎందరెందరో మేధావులు పండితులు స్వామిజీ జీవితంలో ముగిగిపొయ్యి మయిమరచిపోయారు. ఇటువంటి వ్యక్తి భూమి మీద పుట్టడమేమిటి అని ఆశ్చర్యపోతున్నారు. మన దేశాన్ని 250 సంవత్సరాలు పరిపాలించిన ఆంగ్లేయులు భారతీయులను మీరు బానిసలు పనికిరనివారు మీకంటూ ఎటువంటి చరిత్ర వారసత్వంలేదు మీరు అనగరికాలు మేము వచ్చాకే సమస్తం అందించం అని పదే పదే అబద్దం చెప్పుతూ వారి దేశాల్లో దుష్ప్రచారం చేస్తువుంటే మన భారతీయులు ఏమి చేయలేక నిరాశ నిస్పృహలతో గాఢ నిద్రలో మునిగి సతమతం అవుతూవుంటే నిరాశ నిస్పృహలతో నిండివున్న భారతీయులను మేల్కొల్పడానికి అవతరించి మహాపురుషుడు స్వామి వివేకనందుడు.భువనేశ్వరిదేవి విశ్వనాధ్ దత్తలకు 12 జనవరి 1863 జన్మించాడు వివేకానందుని అసలు పేరు నరేంద్రనాద్ దత్త అనతి కాలంలోనే రామకృష్ణపరమహంస శారదాదేవి వద్దకుచేరి వివేకానందుడిగా ప్రపంచ యువతకే ఆదర్శంగా నిలిచాడు. నిరాశ నిస్పృహలతో గాఢనిద్రలో ఉన్న భారతీయులను మేల్కొపడానికి దేశం అంతటా తిరిగి తన ఉపన్యాసాలతో మేల్కొల్పి మన దేశం గురించి ఇతర దేశాల్లో ఉన్న దుష్ప్రచారాన్ని రూపుమవుటకు అమెరికా లోని చికాగో నగరంలో 11 సెప్టెంబర్1893 విశ్వమతాల సభలకు భారతదేశం తరుపున హాజరై వివేకానంద స్వామి మాట్లాడుతూ ఓ అమెరికా దేశపు సోదర,సోదరిమణులరా అనగానే విశ్వమాతసభ ప్రగణం కరాధ్యనుల మధ్య 5నిమిషాలపాటు మారుమోగింది. భారతదేశ ఆచార సంప్రదాయలు సాంస్కృతి గురించి ప్రపంచ దేశాలకు చాటిచెప్పాడు. దేశ స్వతంత్ర్యపోరాటంలో వివేకానందుని ప్రసంగాన్ని విని మారుకొంతమంది ఆయన జీవిత చరిత్రను చదివి యువకులు ఎంతోమంది ఉద్యమబాట పట్టారు. భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి స్వామి వివేకానంద జీవితం నుండి ప్రేరణ పొంది విప్లవవీరులను పుట్ట కోచ్చారు తంతియతోపి,అల్లూరిసీతారామరాజు, మహాదేవగోవిందా రానడే ననసాహెబ్ పీష్వా, జన్సీలక్ష్మీబాయ్,విరసవర్కర్,రాజ్ బిహారిబోస్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, రాజ్ గురు,అరవిందఘోష్, చిత్తరాంజన్ దాస్,రవీంద్రనాథ్ ఠాగూర్,భగత్ సింగ్ మరియు మహాత్మాగాంధీ మొదలైనవారు వివేకానంద జీవిత నుండి ప్రేరణ పొంది స్వాతంత్య్రంకోసం ప్రాణాలు త్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారు. ఇప్పటికి ఇంతోమంది ఐఎఎస్,ఐపీఎస్,ఐఎఫ్ఎస్, లాంటివి సాధిస్తున్నారు. మరెందరో వివేకానంద ప్రేరణతో అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేర్త వెంకటనర్సిరెడ్డి, రవీంద్రారెడ్డి,మాజీ సర్పంచ్ రామచంద్రప్ప, ఆటో యూనియన్ సంగం తరుపున రవీంద్రారెడ్డి, వైఎస్ శ్రీన, వివిధ విద్యార్థి సంఘము నాయకులు,చంద్ర లోకేష్, చేన్న,చిరంజీవి, గంగాధర్ మొదలైనవారు పాల్గొన్నారు.