ENT హాస్పిటల్ లో బ్లాక్ ఫంగస్ కు ట్రీట్మెంట్
తెలంగాణ లో బ్లాక్ ఫంగస్ సోకిన వ్యాధి గ్రాస్తులకు ప్రత్యేకంగా కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో చికిత్సలు అందిస్తామని డీఎం ఈ రమేష్ రెడ్డి ప్రకటించారు. బ్లాక్ ఫంగస్ సోకిన పేషెట్లకు కోవిడ్ తో పాటు ఇతర వ్యాధులు ఉంటే వారికి గాంధీ ఆసుపత్రిలోనే చికిత్సలు అందిస్తామని స్పష్టం చేసారు.పేషెంట్లకు కంటి సంబంధిత సోకితే కంటి వైద్య నిపుణులచే చికిత్సలు అందిస్తామని వివరించారు. ఇందుకోసం ఎస్‌డీ కంటి ఆసుపత్రి ద్వారా చికిత్సలు చేస్తామన్నారు.
బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఉపయోగించే లింఫోసోమల్ అంఫోతెరిసిన్ మందులు దేశ వ్యాప్తంగా కొరత ఉందన్నారు. సరిపడా మందులను కొనుగోలు చేసేందుకు టిఎస్ ఎంఎస్‌ఐడీసీ తగిన చర్యలు చేపడుతుందని చెప్పారు. ఈ మెడిసిన్‌లకు ప్రత్యామ్నాయంగా వినియోగించే పొసకోణాజోల్, ఫ్లూకోణాజోల్ మందులు కూడా కొరత ఉందన్నారు. ఈ మందుల కోసం కూడా ప్రయత్నాలు చేపట్టామన్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకాకుండా కరోనా పేషెంట్లకు స్టెరాయిడ్‌లను, తోసిలోజోమబ్ మందులను తగినంత వినియోగించాలని డాక్టర్లకు సూచించారు.
ఈ మందులను ఎక్కువగా వాడటం వలన పేషెంట్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయిందని చెప్పారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు బ్లాక్ ఫంగస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా తగిన ఏర్పాట్లు చెప్పాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆక్సిజన్ ఫ్లో మీటర్లను నిత్యం శుభ్రపరచడం వలన తగిన జాగ్రత్తలు చెప్పటడం వలన వ్యాధిని అరికట్టవచ్చని వివరించారు.