సంక్రాంతి పండుగను తన సొంత ఊరు నారావారిపల్లి లో…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు ఈ సంక్రాంతి పండుగను తన సొంత ఊరు నారావారిపల్లి లో కుటుంబ సభ్యులు,ఊరి ప్రజలతో కలిసి జరుపుకున్నారు. మొదటగా గ్రామ దేవత సత్యమ్మకు పూజలు చేసి,బంధువులు, భద్రతా సిబ్బంది వద్దు అంటున్నా కాన్వాయ్ ను ఇంటివద్దనే వదిలి… కాలినడకన తన చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మనవడు దేవాన్ష్ చెయ్యిపట్టుకుని మట్టి దారిలో నడుస్తూ వెళ్లి పొలాల్లో ఉన్న తమ కుల దేవత నాగాలమ్మ గుడి వద్ద చంద్రబాబు వారి కుటుంబ సభ్యులు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ వారి కుటుంబ సభ్యులతో కలిసి వేద మంత్రోచ్ఛారణలతో సాంప్రదయబద్ధంగా నాగలమ్మకు పూజలు నిర్వహించారు .తరువాత వారి తల్లితండ్రులైన అమ్మణ్ణమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు వారి కుటుంబ సభ్యులు శాంతి పూజలు జరిపి వారికి నివాళులర్పించారు.