28 గంటల్లో 10 అంతస్తుల భవనం..
చైనాకు చెందిన బ్రాడ్ గ్రూప్ అనే నిర్మాణ సంస్థ అద్భుతం చేసింది. చిత్రంలో కనిపిస్తున్న 10 అంతస్తుల భవనాన్ని ఒక్కరోజులో( 28 గంటలు)నే పూర్తి చేసింది. పునాది నుంచి విద్యుత్ కనెక్షన్ వరకు అన్నీ 28 గంటల్లోనే పూర్తి చేసి ఔరా.. అనిపించింది. ఇది భూకంపాలను కూడా తట్టుకొని నిలబడుతుందని సంస్థ తెలిపింది. ఈ భవన నిర్మాణానికి ఇంజనీర్లు అధునాతన టెక్నాలజీని ఉపయోగించారు. భారీ క్రేన్ల సాయంతో ఒకదానిపై ఒకటి పేర్చుతూ 10 అంతస్తుల నిర్మాణాన్ని పూర్తి చేశారు.