టాస్క్ ఫోర్స్ సిబ్బందికి త్వరలో శాటిలైట్ ఫోన్లు
సమాచార వ్యవస్థ పై దృష్టి సారించాలి
ఎర్రచందనం చెట్లను కొట్టే ముందే అడ్డుకోవాలి
టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఎస్పీ సుందరావు ఆదేశాలు
చిత్తూరు జిల్లా:తిరుపతి,ఎర్రచందనం వృక్షాలను కొట్టే ముందే స్మగ్లర్లు ను అడ్డుకునేందుకు తగిన సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుందర రావు సిబ్బంది ని ఆదేశించారు. మంగళవారం ఆయన ఫీల్డ్ సిబ్బంది తో సమావేశమయ్యారు. అడవుల్లో చేపట్టే కూంబింగ్ పై ఆయన సూచనలు చేశారు. స్మగ్లర్లు గురించి సమాచారం అందించేందుకు వీలయిన వ్యవస్థ ను పటిష్టం చేసుకోవాలని అన్నారు. ఏ విధంగా సమాచారాన్ని పొందాలనే విషయాలను విశ దీకరించారు. అడవుల్లో మొబైల్ ఫోన్లు సిగ్నల్స్ అందక పోవడం లాంటి సమస్యలను అధిగమించేందుకు వీలుగా శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని గురించి ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చించి నట్లు తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎర్రచందనం వృక్షాలను పరిరక్షించడం ద్వారా ప్రజాసేవ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ మురళీధర్, సిఐలు సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, వెంకట రవి, ఆర్ ఎస్ ఐ లు లింగాధర్, విశ్వనాధ్, సురేష్, పోలీస్ క్లినిక్ డాక్టర్ వెంకటేశ్వరరావు, సిసి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.