ఎదిగే పిల్లల కోసం 6 విటమిన్లు – The Most Important 6 Vitamins for growing Children
The Most Important 6 Vitamins for growing Children
ఎదిగే పిల్లల కోసం 6 విటమిన్లు
- విటమిన్ ఎ: చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఎముక బలానికీ, కంటి చూపు మెరుగుపడేందుకూ తోడ్పడుతుంది.
చీజ్, క్యారెట్, పాలూ, గుడ్లూ పిల్లలకి అందించాలి. - బి విటమిన్లూ: మొత్తం శరీర పనితీరు బాగుండి చురుగ్గా ఉండాలంటే అన్ని రకాల బి విటమిన్లూ అందేట్టు చూడాలి.
మాంసం, చేపలూ, సోయా, బీన్స్ వంటివి ఇవ్వడం వల్ల బి విటమిన్లు అందుతాయి. - కండర పుష్టికి: శారీరక దృఢత్వానికీ, అందమైన చర్మానికీ విటమిన్ సి చాలా అవసరం.
టొమాటోలూ, తాజా కాయగూరలూ, పుల్లని పండ్లూ అందించడం వల్ల విటమిన్ సి లభిస్తుంది. - ఎముక బలానికి: ఎముకలు బలంగా ఉండాలంటే ఆహారంలో క్యాల్షియం ఉండాలి. ఇది సమృద్ధిగా అందాలంటే విటమిన్ డి అందాలి. ఇందుకోసం
పాలూ, పాల ఉత్పత్తులతోపాటూ ఉదయం వేళ సూర్యరశ్మి పిల్లలకు అందేట్టు జాగ్రత్త తీసుకోవాలి. - ఇనుము లోపం లేకుండా: ఇది రక్తం వృద్ధి చెందేట్టు చేస్తుంది. ఇందుకోసం
పాలకూర, ఎండుద్రాక్ష, బీన్స్ వంటివి తరచూ పిల్లలకి అందిస్తూ ఉండాలి..