శ్రీ రామ జన్మభూమి మందిర్ విశేషాలు…
1. మందిరం సాంప్రదాయ నగర శిల్పి శైలిలో నిర్మితమైంది.
2. మందిరం పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు.
3. మందిరం మూడంతస్తుల్లో ఉండగా ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి.
4. ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాల రూప విగ్రహం (శ్రీరామ్ లల్లా విగ్రహం) మరియు మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బార్ ఉంటుంది.
5. మందిరంలో ఐదు మండపాలు (హాల్) – నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మరియు కీర్తన మండపాలు ఉన్నాయి.
6. మందిరంలోని స్తంభాలు, గోడలను దేవతల విగ్రహాలతో అలంకరించారు.
7. మందిరానికి తూర్పు వైపు సింహ ద్వారం గుండా 32 మెట్లతో గుడి లోపలకు వెళ్లాలి.
8. మందిరంలో వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంప్‌లు లిఫ్టుల ఏర్పాటు ఉంది.
9. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ (దీర్ఘచతురస్రాకారంలో) నిర్మాణం చేయబడింది.
10. మందిరంలోని నాలుగు మూలల్లో సూర్యుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలున్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం, దక్షిణాన హనుమంతుని గుడి ఉంది.