27 జనవరి, 2019, ఆదివారం, భానుసప్తమి…

27 జనవరి, 2019, ఆదివారం, భానుసప్తమి.

ఆదివారం, సప్తమి తిథి కలిసి వస్తే దాన్ని భాను సప్తమి అంటారు. ఇది చాలా గొప్ప యోగం.

సాధారణంగా #ఆదివారం నాడు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. వాటిలో ప్రధానంగా
1. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం
2. ఆదివారం అభ్యంగన స్నానం చేయకపోవటం. ఆ రోజు కేవలం శిరస్నానం మాత్రమే చేయాలి.
3. వంటికి, తలకు నూనె పెట్టుకోరాదు.
4. ఉల్లి, వెల్లుల్లి, మద్యము, మాంసాహారానికి దూరంగా ఉండాలి.
5. బ్రహ్మచర్యం పాటించాలి.

నవగ్రహాలకు అధిపతి #సూర్యభగవానుడు. ఆయన కటాక్షం ఉంటే మనకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. సుర్యారాధనతో విద్యా, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. నిరుద్యోగులకు #ఉద్యోగం లభిస్తుంది. అవివాహితులకు వివాహమవుతుంది. సంతానం కలుగుతుంది. మనఃశ్శాంతి లభిస్తుంది. సూర్యారాధనతో లభించనిది అంటూ ఏదీ ఉండదు.

– ఈ #భానుసప్తమి అనేది సూర్యునికి సంబంధించిన ఒకానొక పర్వదినమున, గొప్ప #యోగము. ఈ రోజు చేసే స్నానం, దానము, జపము, హోమము లక్ష రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం.
– పెద్దలు ఈ రోజున ఆవుపాలతో చేసిన పరమాన్నము శ్రీ సూర్య భగవానునికి నివేదన చేస్తారు.

– ఆదివారం నాడు సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానాదికాలు ముగించనివారు, ఆహార నియమాలు పాటించని వారికి 7 జన్మల పాటు రోగాలు వస్తాయని, దరిద్రం పడుతుందని శాస్త్రవచనం. ఈ విషయాన్ని పరమశివుడే సూర్యాష్టకంలో చెబుతారు.

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి

భావం – తినకూడని పదార్ధాలు, మద్యము, మాంసము మొదలైనవి తినేవాడు ఏ జన్మల పాటు రోగాలతో బాధపడతాడు. ఆజన్మాంతం దరిద్రం ఉంటుంది. స్త్రీ సమాగమము, తైలం రాసుకోనుట, మద్యమాంసాలను ఆదివారం విడిచిపెట్టినవానికి శోకం, వ్యాధి, దారిద్ర్యం ఉండదు. అతడు నేరుగా సూర్యలోకనికి వెళతాడు.

– ఈ నియమాలు ఒక్క భానుసప్తమికే పరిమితం కాదు, ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్పారు. కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని, దుర్వినియోగం చేయవద్దని సూచన.
– ఈనాడు సూర్యుని అనుగ్రహం కోసం #సూర్యాష్టకం, ఆదిత్యహృదయం, సూర్య ద్వాదశనామాలు పఠించడం శ్రేష్ఠం. #సుర్యనమస్కారాలు ఎంతో శుభఫలితాన్ని, కామ్యసిద్ధిని ఇస్తాయి.

ఓం శ్రీ సూర్యనారాయణ నాయ నమః

?????????

About The Author