తెలంగాణ రాష్ట్రములో 924 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు ఉన్నాయి…
తెలంగాణ రాష్ట్రములో 924 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్ల ద్వారా ప్రతి రోజు రాష్ట్రములోని అన్ని ప్రాంతాల యొక్క వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు రికార్డు చేసి, TSDPS యొక్క అధికార వెబ్ సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా వర్షపాతము, అత్యల్ప ఉష్ణో గ్రతలు, అధిక ఉష్ణోగ్రతలు, గాలిలోని తేమ మొదలయిన అన్ని రకాల నమోదైన వాతావరణ వివరాలను ప్రజలకు మరియు అధికారులకు అందుబాటులో ఉంచడము జరుగుతున్నది. అంతే కాకుండా TSDPS, ప్రతి జిల్లా కలెక్టరు కార్యాలయములలో మరియు GHMC జోనల్ కార్యాలయములలో LED Display Board లను కూడా ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకు మరియు అధికారులకు వాతావరణ స్థితిగతులను తెలియజేయుటకు సంకల్పించినద.ఇందులో భాగంగా ఈ రోజు (02-02-2019) తెలంగాణ రాష్ట్ర సచివాలయములో ఏర్పాటు చేసిన LED Display Board ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీయుత శైలేంద్ర కుమార్ జోషి గారు ప్రారంభించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రములో ఏర్పాటు చేసిన ఈ LED Display Board ల ద్వారా ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్త లను గురించి హెచ్చరికలను సంబంధింత జిల్లా అధికారులు జారీచేస్తారని తెలియజేశారు. TSDPS ఏర్పాటు చేసిన ఈ LED Display Board ల వలన రాష్ట్రములో నెలకొన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితులే కాకుండా రాగల మూడు రోజులకు ముందస్తు వాతావరణ సూచనలను ప్రజలకు మరియు అధికారులకు తెలియజేయడానికి వీలవుతుందని తెలిపారు. ఈ కర్యక్రమములొ ఆర్ధిక మరియు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి K.రామకృష్ణ రావ్ గారు మరియు TSDPS ముఖ్య కార్య నిర్వాహక అధికారి శ్రీ.షేక్ మీరా గారు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్ధిక మరియు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి K.రామకృష్ణ రావ్ గారిని, TSDPS ముఖ్య కార్య నిర్వాహక అధికారి శ్రీ.షేక్ మీరా గారిని మరియు ప్రణాళికా శాఖ సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అభినంధించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా శాఖ సిబ్బంది విశేష కృషి చేస్తున్నారని అన్నారు.