నేడు యాదాద్రి కి సీఎం కేసీఆర్

నేడు యాదాద్రి కి సీఎం కేసీఆర్

యాదాద్రిని అద్భుత దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకుని శ్రీలక్ష్మీనరసింహుడికి పరమభక్తుడి రూపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ తిరుమలకు ధీటుగా యాదాద్రికి రూపమివ్వడానికి పదోసారి ముఖ్యమంత్రి హోదాలో ఆదివారం యాదాద్రి కొండకు చేరుకుంటారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం 11 గంటలకు యాదాద్రిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ రానున్నారు. యాదాద్రి కొండపై జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. కొండపైన నిర్మాణమవుతున్న ప్రధానాలయం పనులపై సమీక్షిస్తారు.

కొండపై ఏమేమి పనులు ఎంత జరిగాయంటే…స్వయంభువులు కొలువైన ప్రధాన ఆలయ నిర్మాణం పనులు 90 శాతం పూర్తయ్యాయి. అలయం లోపల ఆశ్వార్ల విగ్రహాలు, ఆంజనేయస్వామి ఆలయం పూర్తి చేయగా కేవలం ఫ్లోరింగ్ పనులు మిగిలి ఉన్నాయి. అష్టభుజ విజగ్రహాల అమరిక మిగిలి ఉండగా.. పనులు కొనసాగుతున్నాయి. నెల రోజుల్లో ఈ పనులు పూర్తి అవుతాయి. సప్త గోపురాలు అందంగా ముస్తాబు చేశారు. 100 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణాలు ప్రారంభం కాగా.. వీఐపీ సూట్స్ పనులు సైతం 50 శాతం పూర్తయ్యాయి. ఇక టెంపుల్ సిటీలో ఇన్ఫ్రా లే అవుట్ తయారు చేశారు. ఈ టెంపుల్ సిటీలో పీవీటీ వారికి గుర్తుగా భవనాల నిర్మాణాలు ఏ విధంగా చేయాలి అన్న విషయంపై సీఎం డోనర్స్ మాట్లాడి ఒక పాలసీని డిసైడ్ చేస్తారు. ఇందుకోసం డోనర్స్ ఆహ్వానం పంపారు. విష్ణు పుష్కరిణి నిర్మాణం, కల్యాణకట్ట, సత్యనారాయణ స్వామి వ్రతాల నిర్మాణాలు ప్రారంభం కాగా, 30 శాతం పనులు పూర్తయ్యాయి. 20 వేల మంది కూర్చొని స్వామి వారి కల్యాణాన్ని తిలకించే కల్యాణ మండపం నిర్మాణానికి స్థలం ఓకే చేశారు. కొండపైకి వచ్చే వాహనాలు, బస్సులకు పార్కింగ్ పనులు కూడా పూర్తి చేశారు. బస్టాప్ నిర్మాణం ఇంకా మొదలు కాలేదు. కొండను ఇంకొంచెం పెంచి అంటే కొండను తొవ్వి సమాంతరంగా చేసి, అక్కడ షాప్స్ నిర్మాణాలు, లడ్డూ విక్రయ కేంద్రం, తయారీ కేంద్రాలను మొదలు పెట్టారు. 40 శాతం పనులు పూర్తయ్యాయి. కొండకు వచ్చే నలుదిక్కుల్లో ఉన్న రహదారుల సుందరీకరణ పనులు పూర్తి చేశారు. కొండ కింద బస్ బస్ నిర్మాణాలకు స్థలం ఇంకా ఖరారు కాలేదు. కొండ చుట్టూ గిరిప్రదర్శన కోసం నిర్మిస్తున్న రోడ్డు పనులు 50 శాతం పూర్తి చేశారు. గుట్టకు కిలో మీటర్ దూరంలో ఉన్న ప్రస్తుతం బస్ వద్ద ఉన్న రోడ్డు వెడల్పు పనులు కూడా ఇంకా మొదలు కాలేదు. రోడ్డు విస్తరణలో దుకాణాలు పోతున్న వారితో కూడా సీఎం మాట్లాడి వారికి నష్ట పరిహారం సైతం సీఎం కేసీఆర్ నిర్ణయించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ చివరగా 2017 నవంబర్ 24న యాదాద్రికి వచ్చారు. 14 నెలల తరువాత నేడు మళ్లీ వస్తున్నారు.

యాదాద్రి చరిత్రలో సీఎం కేసీఆర్ పాలన సువర్ణాక్షరాలతో…యాదాద్రి చరిత్రలో సీఎం కేసీఆర్ పాలన సువర్ణాక్షరాలతో లిఖించేదిగా ఆధ్యాత్మిక వేత్తలు భావిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగిన నిర్మాణాలు తిరిగి కేసీఆర్ పాలనలో జరుగుతున్నాయని ఆధ్యాత్మికవేత్తలు కొనియాడుతున్నారు. జీయర్ మాటల్లో చెప్పాలంటే ఆధ్యాత్మిక విప్లవం మొదలైంది. ఎన్ని వందల కోట్లయినా ఇస్తాం.. యాదాద్రిని తిరుమలకు ధీటుగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఆచరణ రూపం దాల్చడంతో యాదాద్రి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ ఆధ్యాత్మిక ప్రపంచంలో యాదాద్రికి స్థానం ఉండే విధంగా తెలంగాణకు తలమానికంగా దేశంలోనే పేరెన్నికగన్న పుణ్యక్షేత్రంగా విరజిల్లడానికి అవసరమైన హంగులను సమకూర్చుకుంటున్నది.

2014 అక్టోబర్ నుంచి నేటి వరకు..తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖర్ యాదాద్రికి ముఖ్యమంత్రి హోదాలో 2014 అక్టోబర్ 17 శుక్రవారం కాలు పెట్టారు. కేసీఆర్ యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా మారుస్తామని అదే రోజు ప్రకటించడంతో యాదాద్రికి మంచి రోజులు మొదలయ్యాయి. కేసీఆర్ కాలిడిన వేళావిశేషం వల్ల ఒకవైపు యాదాద్రి అభివృద్ధి ప్రగతి పరుగులు పెడుతుండగా అదే స్థాయిలో పర్యాటక రంగం ఊపందుకుంది. వీటన్నింటిని తలదన్నేలా ఐదు లక్షలకు ఎకరం కూడా పలకని ఇక్కడి భూముల ధరలు రెండు కోట్లకు దాటాయి. ప్రపంచమంతా గమనించే విధంగా ఆయన యాదాద్రికి వెయ్యి కోట్ల రూపాయలైన వెనుకాడమని అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతామని ప్రకటన చేశారు. అంతకుముందు వరకు ముఖ్యమంత్రుల మాదిరిగానే కేసీఆర్ కూడా దర్శించుకొని వెళ్తారని అందరూ భావించారు. కానీ ఎవరు ఊహించని విధంగా అందరికీ వరాలిచ్చే లక్ష్మీనరసింహుడి గుడికే అండగా నేనున్నానంటూ అభయమిచ్చారు. నాటి నుంచి నేటివరకు అనేక పర్యాయాలు యాదాద్రిలో విహంగ వీక్షణం చేయడం, కొండపై అనువణువు శోధించడం కేసీఆర్ అలవాటుగా మారిపోయింది. తన స్వంత ఇంటి పనికన్నా ప్రాధాన్యతను ఇస్తూ గుడి వెలుగులే తనకు ముఖ్యమన్న ధోరణితో సీఎం ముందుకు సాగుతున్నారు. రెండేండ్లలో సుమారు వెయ్యి డిజైన్లను పరిశీలించి చివరికి ఆగస్టు నెలలో డిజైన్లను ఫైనల్ చేసారంటే ఆలయ అభివృద్ధి విషయంలో ఎంత సూక్ష్మ పరిశీలన చేస్తున్నారో అవగతమవుతుంది. అంత చొరవ తీసుకొని చేసిన డిజైన్లకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత లభించింది. డిజైన్లకు వాస్తవరూపం ఇచ్చేందుకు జరుగుతున్న పనులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే విధంగా ఉన్నాయి. యాదాద్రిలో ఇప్పుడు జరుగుతున్న పనులను ఎవరూ ఊహించలేదు. సీఎం చూపిస్తున్న చొరవ… ఆయన స్వప్నం ఎంత బలీయమైందో ప్రపంచమంతా గమనిస్తున్నది.

పదోసారి యాదాద్రికి వస్తున్న సీఎం..యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యమంత్రి హోదాలో 2017 అక్టోబర్ 24న మరోసారి యాదాద్రిని సందర్శించి తెలంగాణకు తలమానికమైన యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని, అందుకు అవసరమైన అన్ని హంగులు సమకూరుస్తామని కేసీఆర్ పునద్ఘాటించారు. శ్రీవారిని దర్శించుకుని పనులను పర్యవేక్షణ చేయడం ఇదీ తొమ్మిదోసారి. మొట్టమొదటి సారి ఆయన 17-10-2014న శ్రీవారిని దర్శించుకున్నారు. 2014లో డిసెంబర్ 17న రెండోసారి దర్శించుకున్నారు. 2015లో ఫిబ్రవరి 25, 27న, మార్చి 5న జరిగిన శ్రీవారి కల్యాణంలో సతీసమేతంగా పాల్గొన్నారు. మే 30న మరోసారి యాదాద్రి అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతితోపాటు జూలై 5న దర్శించుకున్నారు. 2016 అక్టోబర్ 19న యాదాద్రిలో పనులను పర్యవేక్షించారు. 23 నవంబర్ 2017లో పర్యటించి పలు సూచనలు చేశారు.

హెలిప్యాడ్ సందర్శించిన అధికారులు..హెలిప్యాడ్ వద్ద గల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, భువనగిరి జోన్ డీసీపీ రామచంద్రారెడ్డి, ఇతర అధికారులు పరిశీలించారు. కొండపైన కల్యాణ మండపం, త్రితల గోపురముల వరకు వాహనంలోనే రోడ్డు మార్గం ద్వారా సీఎం ప్రయాణిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు కొండపై పలు ఆంక్షలు విధించారు.

About The Author