ప్ర‌తీ ఆటోకు టిడిపి జెండా : థాంక్యూ సీయం సార్ అంటు బోర్డులు : ప‌్ర‌భుత్వ సొమ్ముతో పార్టీ ప్ర‌చారం..?


ప్ర‌తీ ఆటోకు టిడిపి జెండా : థాంక్యూ సీయం సార్ అంటు బోర్డులు : ప‌్ర‌భుత్వ సొమ్ముతో పార్టీ ప్ర‌చారం..!

న‌ల్లటి దుస్తులతో అసెంబ్లీలో ద‌ర్శ‌న‌మిచ్చిన ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు .. ఈ రోజు ఆటో డ్రైవ‌ర్ గా క‌నిపించారు. ఏపి ప్ర‌భుత్వం తాజాగా ఆటో ల పై లైఫ్ టాక్స్ ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీని కార‌ణంగా ప్ర‌భుత్వం పై భారం ప‌డి నా ముందుకు వెళ్లింది. దీంతో..ఆటో డ్రైవ‌ర్లు ముఖ్య‌మంత్రిని క‌లిసి అభినందించారు.
ప్ర‌తీ ఆటోకు టిడిపి జెండా క‌ట్టండి..
ముఖ్య‌మంత్రి త‌మ ప్ర‌భుత్వ నిర్ణ‌యాల ల‌బ్దిదారులు పూర్తగా టిడిపి ఓట‌ర్లుగా మారాల‌ని కోరుకుంటున్నారు. అందులో భాగంగా..ఆటో డ్రైవ‌ర్ల‌కు అదే ర‌కంగా సూచ‌న‌న‌లు చేసారు. ప్ర‌భుత్వం ఆటో డ్రైవ‌ర్ల‌కు లైఫ్ టాక్స్ ర‌ద్దు చేయ‌టం వ‌ల న ప్ర‌భుత్వ ఆదాయం త‌గ్గ‌తుంద‌ని..అయినా ఆటో డ్రైవ‌ర్ల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని ముఖ్య‌మం త్రి చెప్పుకొచ్చారు. త‌మ నిర్ణ‌యం కార‌ణంగా 3.70 ల‌క్ష‌ల మంది ఆటో డ్రైవ‌ర్ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని వివ‌రించారు.
పార్టీకి 65 ల‌క్ష‌ల మంది కార్య‌క‌ర్త‌లు
.త‌మ పార్టీకి 65 ల‌క్ష‌ల మంది కార్య‌క‌ర్త‌లు ఉన్నార‌ని చెప్పుకొచ్చారు. ఈ నిర్ణ‌యం కారణం గా మేలు జ‌రిగిన ఆటో డ్రైవ‌ర్లు ప్ర‌తీ ఆటో కి టిడిపి జెండా క‌ట్టాల‌ని..ఆటో వెనుక థాంక్యూ సీయం సార్ పేరుతో బోర్డులు పెట్టాల‌ని సూచించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి కి అండ‌గా నిలవాల‌ని ఆకాంక్షించారు. రానున్న 75 రోజుల పాటు సైనికుల్లాగా త‌న గెలుపు కోసం ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు.
ఆటో డ్రైవ‌ర్ గా చంద్ర‌బాబు..
ముఖ్య‌మంత్రిని ఆటో డ్రైవ‌ర్లు విజ‌య‌వాడ పార్టీ నేత‌ల ఆధ్వ‌ర్యంలో సీయం వ‌ద్ద‌కు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో సీయం వారితో క‌లిసి ఆటో డ్రైవ‌ర్ డ్ర‌స్ వేసుకొని త‌న నివాస ప్రాంగ‌ణంలో కొద్ది సేపు ఆటో న‌డిపారు. తన జీవితానికి ఆటో డ్రైవ ర్ల జీవితానికి ఎన్నో దగ్గర పోలికలు ఉన్నాయన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని డ్రైవర్లు పోషిస్తుంటే రాష్ట్రాన్ని నడుపుతూ ప్రజల సంక్షేమాన్ని తాను చూస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ఆటోడ్రైవర్లందరికీ పెద్దన్నగా తానుంటా న్నారు. ప్రయాణికుల క్షేమం మీరు చూసుకోండి.. మీ క్షేమం నేను చూసుకుంటాను అని ముఖ్య‌మంత్రి ఆటో డ్రైవ‌ర్ల కు భ‌రోసా ఇచ్చారు. ఇత‌ర స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం యూనియ‌న్ గా ఏర్ప‌డి త‌న వ‌ద్ద‌కు రావాల‌ని సూచించారు. అయితే, ప్ర‌భుత్వ సొమ్ముతో వారికి మిన‌హాయింపులు ఇస్తూ పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేయ‌మ‌ని కోర‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

About The Author