యాదాద్రి ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తున్న…
ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదివారం యాదాద్రిలో పర్యటించారు. ఉదయం బేగంపేట నుంచి హెలిక్యాప్టర్ ద్వారా బయలుదేరి యాదాద్రి చేరుకున్నారు. తొలుత యాదాద్రి చుట్టూ తిరిగి ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రధాన ఆలయమున్న గుట్టపైనా, టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తున్న గుట్టపైనా, ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మిస్తున్న గుట్టపైనా జరుగుతున్న నిర్మాణాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. తర్వాత బాలాలయంలో శ్రీ లక్ష్మి నర్సింహస్వామని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ లక్ష్మి నర్సింహచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వాద వచనం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రధాన దేవాలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆలయం, మంటపం, గర్భగుడి, బాహ్య ప్రాకారాలు, అంతర ప్రకారాలు, మాడవీధులు, రథశాల, వ్రత మంటపం, ధ్వజస్తంభం, ప్రసాదం కౌంటర్లు, శివాలయం పనులను పరిశీలించారు. అధికారులకు, శిల్పులకు తగు సూచనలు చేశారు. ప్రధాన ఆలయమున్న ప్రాంతంలోని 173 ఎకరాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆ తర్వాత టెంపుల్ సిటీగా అభివృద్ధి పరుస్తున్న గుట్టను సందర్శించారు. అక్కడి పనులను పరిశీలించారు. రెండు గుట్టలను కవర్ చేస్తూ ఔటర్ రింగు రోడ్డు నిర్మిస్తామని, నిధులు వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు. యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణ పనులన్నింటినీ సమాంతరంగా చేయాలని చెప్పారు. వందల ఏళ్ల పాటు నిలిచిపోయే శాశ్వత నిర్మాణం కాబట్టి ఎలాంటి తొందరపాటు, తొట్రుపాటు లేకుండా పనులు చేయాలని, నాణ్యత విషయంలో రాజీపడవద్దని సూచించారు. ముఖ్యమంత్రి వెంట మాజీ మంత్రి శ్రీ జగదీశ్ రెడ్డి, ఎంపిలు శ్రీ జె. సంతోష్ కుమార్, శ్రీ బూర నర్సయ్య గౌడ్, శ్రీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు శ్రీమతి గొంగిడి సునిత, శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి, శ్రీ గ్యాదరి కిశోర్, శ్రీ మర్రి జనార్థన్ రెడ్డి, శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీ క్రిష్ణారెడ్డి, శ్రీ కర్నె ప్రభాకర్, మాజీ మంత్రి శ్రీమతి ఉమా మాధవరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ శ్రీ కిషన్ రావు, కలెక్టర్ శ్రీమతి అనితా రామచంద్రన్, రాచకొండ సిపి శ్రీ మహేశ్ భగవత్, ఆలయ ఈవో శ్రీమతి గీత తదితరులున్నారు.
అన్నదాన సత్రం కోసం రాజు వెగెస్నా 10 కోట్ల విరాళం:
———————————————————-
యాదాద్రిలో అన్నదాన సత్రం నిర్మించడం కోసం హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ రాజు వెగెస్నా (Raju Vegesna) ఫౌండేషన్ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రూ.10 కోట్ల విరాళం అందించారు. ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీ అనంత కోటి రాజు, కార్యదర్శి శ్రీ ఆనందర రాజుల ఆధ్వర్యంలో యాదాద్రిలో ముఖ్యమంత్రిని కలుసుకున్న సభ్యులు చెక్కు రూపంలో విరాళం అందించారు. అన్నదాన సత్రం నిర్మాణానికి ఇంతకంటే ఎక్కువ వ్యయం అయినా భరిస్తామని వారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. యాదాద్రిలో సత్రాలు, గెస్టు హౌజులు నిర్మించడానికి చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికి 43 మంది దాతలు తలా రూ.2 కోట్ల ఇవ్వడానికి ముందుకొచ్చారన్నారు. వారందరికీ సిఎం ధన్యవాదాలు తెలిపారు.
Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao visited Yadadri on Sunday. CM left for Yadadri from Begumpet Airport in the morning and reached Yadadri. CM conducted Aerial Survey around Yadadri. CM observed the ongoing works of Main Temple, Temple City, and Construction of Presidential suite on the hill through aerial survey. CM visited Sri Laxmi Narsimha Swamy at Balaalayam and conducted the rituals. Chief Priest of the Yadadri Temple Sri Laxmi Narsimhacharyulu and Pandits welcomed the Chief Minister and showered blessings on him. Later CM inspected the works of the reconstruction of the Main Temple. CM inspected Main Temple, the sanctum Sanctorum, outer walls, interior walls of the sanctorum, Madaveedulu, Rathasala, Vratha Mantapam, Dwajasthambam, Counters of Prasadam. CM made some suggestions to the officials and sculptures. CM has personally examined the development works taken up in and around the main temple sprawling 173 acres. Later, CM visited the hill and inspected and reviewed the works of temple city. CM said that funds will be sanctioned for the construction of outer ring road covering two hills. CM instructed the officials to complete the works of the reconstruction of the yadadri temple and outer ring road simultaneously. CM said that the Temple and other structures are permanent and should last longer for many years and every care should be taken on quality of the works without compromising on its standards.
Former Minister Sri Jagadeesh Reddy, MPs Sri J. Santosh Kumar, Sri Bura Narasaiah Goud, Sri Badugula Lingaiah Yadav, MLAs Smt. Gongidi Sunitha, Sri Shekhar Reddy, Sri Gyadari Kishore, Sri Marri Janardhan Reddy, Sri Kancharla Bhoopal Reddy, MLCs Sri Krishna Reddy, Sri Karne Prabhakar, former Minister Smt. Uma Madhava Reddy, Special Officer Sri Kishan Rao, Collector Smt. Anitha Ramchandran, Rachakonda CP Sri Mahesh Bhagavath, Temple EO Smt. Geeta were present along with the CM.
Raju Vegesna donates Rs. 10 Crore for Annadana Satram
———————————————————
The members of Raju Vegesna Foundation, a non-governmental organization which conducts charitable programmes in Hyderabad and Visakhapatnam has donated Rs. 10 Crore to CM for the construction of Annadana Satram. Foundation President Sri Anantha Koti Raju, Secretary Sri Ananda Raju and other members met CM and handed over the Cheque. They assured the CM that they will bear the expenses if cost of the construction of Annadana Satram exceeds Rs. 10 Crore. CM said on this occasion, that many philanthropists are coming forward for the construction of Guest houses and choultries. CM expressed his thanks to all 43 Donors who have come forward to donate Rs. 2 Cr each.