బజ్జీల బండి, రెస్టారెంట్లకు అలర్ట్… వాడిన ఆయిల్ మళ్లీ వాడొద్దు :
ప్రధాన నగరాలు, పట్టణాల్లో గల్లీగల్లీలోనూ బజ్జీల బండి, స్వీట్ తయారీ స్టాల్, రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లు కనిపిస్తున్న రోజులివి. అందరూకాకపోయినా.. చాలామంది తయారీదారులు… వాడిన ఆయిల్ నే మళ్లీ మళ్లీ వాడుతూ.. గోలించిన ఆయిల్ లోనే మళ్లీ పూరీలు, వడలు, బజ్జీలు, మిర్చీలు, జిలేబీలు… ఇలా అన్నిరకాల తినుబండారాలను వేయించి తయారుచేస్తుంటారు. ఇదే ఆయిల్ ను మిగతా ఆహారం తయారీకి కూడా వాడుతుంటారు.
ఇలా వాడిన ఆయిల్ ను మళ్లీ మళ్లీ ఆహార పదార్థాల్లో వాడటం వల్ల .. వాటిలోని పోషకాలు నశించి.. ఫ్రైయింగ్ ఫ్యాట్స్ లాంటి హానికారకాలు పుట్టుకొచ్చి.. జనాల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి. శరీరాల్లో కొవ్వు పెరిగిపోతోంది. బీపీ సమస్యలొస్తున్నాయి. కాలేయ సమస్యలు సతమతం చేస్తున్నాయి. ఈ ప్రమాద సంకేతాలపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) అప్రమత్తమైంది. వాళ్లూ వీళ్లని లేదు… అందరూ పాటించాల్సిందేనంటూ… మార్చి ఫస్ట్ నుంచి కొత్త రూల్స్ ను ప్రవేశపెడుతోంది.
ఇవే ఆ రూల్స్
ఆయిల్ ను 3 సార్లకంటే ఎక్కువగా రీయూజ్ చేయొద్దు. మార్చి ఫస్ట్ నుంచి అన్ని రెస్టారెంట్లలో ఆయిల్ వాడకంపై ఓ జాబితాను ప్రదర్శించాల్సి ఉంటుంది. ‘ఎంత ఆయిల్ వాడారు.. దాంతో.. ఎంత ఆహారం తయారుచేశారు”.. ఇలా ఓ చార్ట్ మెయిన్ టెయిన్ చేయాల్సి ఉంటుంది. 50 లీటర్ల కంటే ఎక్కువ ఆయిల్ వాడే పెద్ద పెద్ద రెస్టారెంట్లపైనా అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ రూల్స్ పాటించని రెస్టారెంట్ల లైసెన్స్ ను రద్దు చేస్తారు.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (లైసెన్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్) ఫస్ట్ అమెండ్ మెంట్ రెగ్యులేషన్స్ 2017 ప్రకారం.. 3 సార్లు ఆయిల్ ను వాడితే అది పాడైపోయినట్టే. ఆ తర్వాత కూడా దానిని వాడితే ఆరోగ్యంపై తీవ్రమైన విష ప్రభావం ఉంటుంది. స్ట్రీట్ సైడ్ ఫుడ్ కోర్టుల్లోనూ తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాల్సిందే అని సూచించారు.
రెస్టారెంట్లు, ఇతర అన్ని ఫుడ్ కోర్టులపైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు మార్చి 1 నుంచి స్పెషల్ డ్రైవ్స్ చేయాలని… ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(fssai) ఆదేశాలు జారీచేసింది.