పెద్దలు చిన్నారులకు మంచి అలవాట్లు నేర్పండి…


పెద్దలు చిన్నారులకు మంచి అలవాట్లు నేర్పండి…
పిల్లలు ప్రవర్తించేతీరు, నడవడి, వారి మాటలు పెద్దల ప్రవర్తన, వారి పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. ఏ గూటి చిలుక, ఆ పలుకులే పలుకుతుంది అంటారు పెద్దలు. పిల్లల అలవాట్లు, పెద్దలు ఇచ్చే శిక్షణకు అనుగుణంగా ఉంటాయి. బాల్యం నుంచే మంచి అలవాట్లను వారికి నేర్పిం చాలి. చిన్నప్పటినుంచే అలవడిన మంచి పద్ధతులు, మంచి లక్షణాలు పెద్దయ్యాక మంచి వ్యక్తిత్వాన్ని ఏర్పరుస్తాయి. సరైన శిక్షణ పొందిన పిల్లలు తాము మంచిపేరు తెచ్చుకోవటమేకాకుండా, తమ తల్లిదండ్రు లకు మంచి పేరుతెస్తారు. పిల్లలను ఏవిధంగా తీర్చిదిద్దవలసినది, పిల్లలకు నేర్పవలసిన మంచి అలవాట్లు ఏమిటన్నది ప్రతీ తల్లిదండ్రులు తెలుసు కోవడం ఎంతయినా అవసరం.

• నదులలోను, కాల్వల్లోను తోడూ లేకుండా, లోతు తెలియకుండా దిగకూడదు.

• పాఠశాలనుండి సాయంత్రము వచ్హేటప్పుడు పరిచయంలేని వ్యక్తులతో రాకూడదని కేవలం తల్లిదండ్రులు నియమించిన వ్యక్తులతో మాత్రమే తిరిగి ఇంటికి రావాలని గట్టిగా చెప్పాలి.

• పాఠశాలకు వెళ్ళబోయే వయస్సున్న పిల్లలకు తమంతటతామే ఆహారం తినేటట్లు నేర్పించాలి. ఆహారం తినగానే చేతులు, నోరు కడుక్కుని నాఫ్కిన్తో తుడుచుకునే అలవాటు చేయాలి.

• తమ ఆటవస్తువులను తోటిపిల్లలు అడిగితే, వారికి ఇవ్వాలని, వారితో కలిసి, ఆడుకోమని పెద్దలు బోధించాలి.

• పండుతొక్కలను, గింజలను, చెత్త కాగితాలను గదిలో నేలమీద పడెయ్య కుండా, డస్ట్బిన్లో పడేసే అలవాటు చేయాలి.

• ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో, తమ మాటలకు అడ్డం తగులుతూ మాట్లాడకూడదని, పెద్దల సంభాషణకు అంతరాయం కలిగించకూడదనీ పిల్లలకు చెప్పాలి.

• ఇతరులు ఇంటికి వచ్చినప్పుడు కానీ, తాము ఇతరుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు కానీ పేచీలు పెట్టకూదని, అల్లరి చేయకుండా బుద్దిగా ఉండటం నేర్చుకోమని చెప్పాలి. మంచి పిల్లలు ఎప్పుడైనా అలా చేయరని మృదువుగా చెప్పాలి.

• పెద్దవారు మాట్లాడుకునే సమయంలో పిల్లలు పెద్దల పక్కనే ఉండి, వారి మాటలు వినే అలవాటు చేయకూడదు. వారు ఆటలలోనో, వేరేపనిలోనో నిమగ్నమయేలా చేయాలి.

• చిన్నపిల్లలు ఆరిందాల్లా, ముదినాపసానిలా ముచ్చట్లు చెప్తూంటే ఆ మాటలను పెద్దలు ఖండించాలి. అలా మాట్లాడుతుంటే విని మురిసిపోకూడదు. వారి వయస్సుకు తగ్గ ఆలోచనలు, మాటలు, ప్రవర్తన పిల్లల్లో ఉండాలి.

• తినే పదాలర్థాలను, ఆటవస్తువులను తోటిపిల్లలతో షేర్ చేసుకునే అలవాటు బాల్యం నుంచే ఏర్పడాలి.

• ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలకు చిరుతిళ్ళు పెట్టకూడదు. ఆహారనియమా లను వారికి నేర్పించాలి.

• ఆడపిల్లలని పదే పదే అద్దంలో తన అందాన్ని చూసుకోనియకూడదు.

• పొద్దుపోయేదాకా నిదుర పోనియకూడదు.

• పిల్లల వయస్సుకు తగినట్లుగా వారికి పనులను అప్పగిస్తూ చిన్న చిన్న పనులను వారిచేత చేయించాలి. వాటర్ బాటిల్ నింపుకోవడం, పుస్తకాలను స్కూలుకు వెళ్ళ బోయే ముందే బ్యాగులో సర్దిపెట్టుకోవడం, బూట్లు పాలిష్ చేసుకోవడం, స్కూలు యూనిఫాంను సాక్స్ను ఉతకటానికి పడెయ్యడం, స్కూలు టై, బ్యాడ్జి, షఉస్ సాక్స్ యూనిఫాం రెడీగా ఉంచుకోవడం లాంటిపనులు స్వయంగా చేసుకోవడమన్నది బాల్యం నుంచే అలవాటు చేయాలి.

About The Author